మార్చి మొదటి వారంలో బడ్జెట్‌

eetalaరాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను మార్చి మొదటి వారంలో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ శాఖల వారీగా అందిన బడ్జెట్ ప్రతిపాదనలకు తుదిరూపు ఇచ్చారు అధికారులు. ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాతో బడ్జెట్ రూపకల్పనపై చర్చించారు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్. ఈసారి బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేయాలనే దిశలో
పద్దులు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రణాళిక,ప్రణాళికేతర బడ్జెట్‌కు స్వస్తి పలికిన క్రమంలో ఈసారి బడ్జెట్‌ను క్యాపిటల్, రెవెన్యూ వ్యయంగా రూపొందించనున్నారు. ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు లేకుండా కొత్త తరహాలో రూపుదిద్దుకుంటున్న 2017-18 బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి మరింత పెద్దపీట వేయడానికి ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి పద్దు, నిర్వహణ పద్దులను ప్రవేశపెట్టనుంది.

ఎస్సీ, ఎస్టీ నిధుల వాటా పెరుగడంతో పాటు సంక్షేమ రంగానికి 20 శాతం వరకు నిధులను కేటాయించే అవకాశముందంటున్నారు అధికారులు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను పకడ్బందీగా అమలుచేయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వాస్తవానికి 2011 జనాభా ప్రాదిపదికన సంక్షేమ పథకాల కింద ఎస్సీలకు 2016-17వార్షిక బడ్జెట్‌లో మొత్తం 15.45 శాతం నిధులను (రూ.10, 483 కోట్లు) కేటాయించారు. ఎస్టీలకు 9 శాతం నిష్పత్తిలో 4,693 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ రెండు భాగాలలో ప్రగతి పద్దు, నిర్వహణ పద్దు కింద బడ్జెట్‌ను రూపకల్పన చేస్తున్నారు. ఈ బడ్జెట్‌లో విద్య, వైద్యం, ఆరోగ్యంతోపాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువ కేటాయింపులు చేయనుంది ప్రభుత్వం. విద్య, వైద్యం కాకుండా ఇతర సంక్షేమ పథకాలకు దాదాపు 16 నుంచి 17వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నది. సంక్షేమ రంగానికి కేటాయింపుల వాటా రూ.20 వేల కోట్లకు పెంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వెనుకబడి ఉన్న వారితో పాటు చేతి, కులవృత్తుల వారికి చేయూత ఇవ్వడంపై బడ్జెట్‌లో ప్రత్యేక నిధులను కేటాయించడానికి కసరత్తు చేస్తున్నారు ఈటల.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy