మార్చి 7వ తేదీ నుంచి ఫైనల్ ఎగ్జామ్స్

websiteరాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళలో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఫైనల్ ఎగ్జామ్స్ ను  మార్చి నెల 7వ తేదీ నుంచి నిర్వహించేందుకు పాఠశాల విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని స్పష్టం చేసింది. అయితే వచ్చే నెల 9న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఉన్నందున.. ఆరోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలని విద్యాశాఖ భావిస్తోంది. వాటిని ఏయే తేదీల్లో నిర్వహించాలన్న దానిపై త్వరలో నిర్ణయించనున్నట్లు తెలిపింది.

14వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నందున… 9వ తేదీ నాటి పరీక్ష నిర్వహణకు మరొక రోజును ఖరారు చేయాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. వీలైతే 15వ తేదీన నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తోంది. 9వ తేదీన ఉదయమే పరీక్షలు పూర్తయితే మధ్యాహ్నం నుంచి టీచర్లు ఓటింగ్‌కు వెళ్లే వీలు ఉంటుందని…అలా నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్నీ పరిశీలిస్తున్నారు. మరోవైపు 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి… 17న ప్రోగ్రెస్‌ రిపోర్టులను విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు పంపిస్తారు. విద్యార్థుల మార్కుల వివరాలను 7వ తేదీ నుంచి 19వ తేదీ వరకు క్యుములేటివ్‌ రికార్డుల్లో నమోదు చేస్తారు. 20న తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి ప్రోగ్రెస్‌ రిపోర్టులపై చర్చిస్తారు. విద్యార్థులు 21న తల్లిదండ్రుల సంతకాలు తీసుకుని క్యుములేటివ్‌ రికార్డులను స్కూల్లో అప్పగించాలి. అదే రోజు నుంచి 2017–18 విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy