మార్చి26న అంబేద్కర్ వర్శిటీ ఎంట్రెన్స్ టెస్ట్

BR AMBETHKARడా. బీఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ  ఎంట్రెన్స్ టెస్ట్ మార్చి 26న నిర్వహించనున్నారు.గతంలో ప్రకటించిన షెడ్యూ ల్ ప్రకారం ఈ పరీక్ష ఫిబ్రవరి 26న నిర్వహించాల్సి ఉంది. అయితే ఆరోజు ఆంద్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్ష ఉన్నందున అర్హతా పరీక్ష తేదీని మార్చి 26కు మార్చినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.ఎలాంటి విద్యార్హత లేకు న్నా 18సంవత్సాలు నిండిన వారంతా ఈ అర్హతాపరీక్షలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని మార్చి 16లోగా అన్‌లైన్‌లో దరఖాస్తులను అందజేయాలని కోరారు. వివరాలకోసం WWW.BRAOUONLINE.IN వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy