దేశం కోసం యువత ముందుకెళ్లాలి : ప్రధాని

DHPObHxUMAAIa0a.jpg largeదేశంలోని యువత కొత్త సంకల్పంతో ముందుకెళ్లాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. 71వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ప్రధాని త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించిన అనంతరం ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. 21వ శతాబ్ధంలో జన్మించిన నవ యువకులకు ఈ జనవరి 1 కొత్త అవకాశాన్ని ఇస్తుందన్నారు. ఈ శతాబ్ధిలో జన్మించిన నవ యువత మొదటిసారి ఓటు హక్కు సాధించుకోబోతున్నది. దేశ ప్రగతిని కొత్త దిశగా నడిపించే అవకాశం యువతకు వస్తుందని ప్రధాని పేర్కొన్నారు. నిరాశ నిస్కృహలను వీడి యువత ముందడుగు వేయాలని ప్రధాని నిర్దేశించారు.

ఈ దేశం నిజాయితీ పరులదని..అవినీతి పరులు, అక్రమార్కులకు స్థానం లేదని ప్రధాని స్పష్టం చేశారు. క్విట్ ఇండియా ఉద్యమానికి 75ఏళ్లు పూర్తయ్యాయి. స్వరాజ్యం నా జన్మహక్కు అని తిలక్ ప్రారంభించిన గణపతి ఉత్సవాలకు 125 ఏళ్లు పూర్తయ్యాయని ప్రధాని చెప్పారు. ఒక వ్యక్తి ఏదీ చేయలేడని..అదే సమిష్టిగా ఎంతైనా సాధించగలడని ప్రధాని అన్నారు. శ్రీకృష్ణుడు, రామచంద్రుడు మనకు ఆదర్శ పురుషులు. ఆలమందను కాపాడేందుకు శ్రీకృష్ణుడు గోవర్దన గిరి ఎత్తాడు. వానర సమూహం సాయంతో సముద్రంపై రాముడు సేను నిర్మించారు. 125 కోట్ల భారతీయులందరం ఒక్కటై కొత్త సంకల్పంతో ఏదైనా సాధించవచ్చన్నారు.

జీఎస్టీని తీసుకొచ్చి సహకార సమాఖ్య వ్యవస్థకు కొత్త జవసత్వాలు అందించామన్నారు. తక్కువ సమయంలో జీఎస్టీ ఎలా అమలు చేశారని ప్రపంచం ఆశ్చర్యపోతున్నదని ప్రధాని తెలిపారు. భారతదేశంలో నిబద్ధత, సాంకేతికతలో ఉన్న నైపుణ్యత జీఎస్టీని సుసాధ్యం చేసిందని ప్రధాని వెల్లడించారు. దేశంలోని మూలమూలకు విద్యుత్ వెలుగులు ప్రసరిస్తున్నాయి. ఇంటింటికీ గ్యాస్ పొయ్యిల ద్వారా కోట్లాది పేద మహిళలకు పొగ నుంచి విముక్తి కలిగిందన్నారు ప్రధాని మోడీ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy