మావటిపై దాడి చేసిన శ్రీవారి గజరాజు

elephantశ్రీవారి గజరాజు దాడికి దిగింది. సాక్షాత్తు నిరంతరం వాటిని కన్న బిడ్డలా పెంచుతున్న మావటిపైనే తన ప్రతాపాన్ని చూపించింది. తిరుమలలో స్వామివారి ఊరేగింపుకు తీసుకొస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

ప్రతిరోజులాగే గజరాజులు లక్ష్మీ, అవనిజలను ఆలయం ముందుకు తీసుకొస్తున్నాడు మావటి గంగయ్య. వరాహస్వామి ఆలయం వద్దకు రాగానే ఏమైయిందో ఏమో.. ఒక్కసారిగా మావటిని తన తొండంతో కొట్టింది అవనిజ. తన పాదంతో మావటి కాలు విరిగింది. దీంతో అక్కడే ఉన్న మరో మావటి ఏనుగును కట్టడి చేసి కాళ్లకు సంకెళ్లు వేశారు. గాయాలపాలైన మావటి గంగయ్యకు తిరుమలలో వైద్యం అందించి.. మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్వీమ్స్ కు తరలించారు. అవనిజ అనే గజరాజు మదం ఎక్కి పిచ్చిగా ప్రవర్తించటంతో దాన్ని గోశాలకు తరలించారు. దీంతో నేడు శ్రీవారి ఊరేగింపు గజరాజులు లేకుండానే జరుగుతుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy