మావోలు బలపడుతున్నారా..?

Maoist-call-for-telangana-bandh-november-8th---ID1_1414848126వరంగల్ ఎన్ కౌంటర్ తో అలర్ట్ అయ్యారు పోలీసులు. తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యం అంతగా లేదని చెబుతున్న టైమ్ లో .. .ఎన్ కౌంటర్ జరగడం.. ఇవాళ మరో ముగ్గురు మావోయిస్టులు పట్టుబడడం అనుమానాలకు తావిస్తోంది.  అయితే మొన్న ఎన్ కౌంటర్ చనిపోయిన మావోలు ఈమధ్యే ఉద్యమంలో చేరినట్లు కూడా తెలియడం పోలీసులను కలవర పెడుతోంది. దీంతో ఇంతకు మావోల వ్యూహం ఏంటనే దానిపై  పోలీసులు ఫోకస్ చేశారు.

ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీలో టెన్షన్ వాతవరణం కనిపిస్తోంది. ఎన్ కౌంటర్ లో ఇద్దరు చనిపోయిన ఘటన మరిచిపోక ముందే .. శుక్రవారం వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం చిట్యాలలో ముగ్గురు మావోలు, ఓ గ్రామస్తున్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో ఐదుగురు తప్పించుకున్నట్టు సమాచారం. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు ఏజెన్సీ వాసులు. అరెస్టైన వారిలో దళ కమాండర్ మహేష్, దళ సభ్యులు భీమాన్, కిష్టయ్యు ఉన్నట్టు తెలుస్తోంది.

బుధవారం ఎన్ కౌంటర్..శుక్రవారం ముగ్గురు మావోలు పట్టుబడడం పోలీసులను కలవర పెడుతోంది. మావోల ప్రాబల్యం పెరుగుతోందన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. గతంలో కంటే మావోల సంఖ్య పెరిగినట్లు కూడా తెలుస్తోంది. కాని ఎక్కడ సంచరిస్తున్నారు.. ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారన్నది పోలీసులకు అంతు చిక్కడం లేదు. ఏడాది కాలంగా మావోల కదలికలు ఎక్కువైనట్టు భావిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో మావోలు తిరిగినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే పార్టీ బలోపేతంపై మావోలు దృష్టి పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మొన్న ఎన్ కౌంటర్ లో చనిపోయిన ఇద్దరు ఈ మధ్యే ఉద్యమంలోకి వెళ్లారు. పైగా చదువుకున్నవాళ్లు. దీని ఆధారంగా మావోలు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టినట్లు అర్థమవుతోంది.

కొందరు మావో అగ్రనేతలు అడవుల్లో తిరుగుతుంటే..మరి కొందరు పార్టీ బలోపేతంపై వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. సిర్పూర్ పేపర్ మిల్లు, సార్వత్రిక సమ్మెపై  ప్రకటనలు కూడా రిలీజ్ చేశారు మావోలు. ప్రజా సమస్యలపై స్పందిస్తూనే… ఆదిలాబాద్, వరంగల్ కేంద్రంగా పార్టీని బలపరిచే పనిలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో ఎన్ కౌంటర్ జరుగుతుండటంతో మావోయిస్టులు ఇక్కడ తలదాచుకునేందుకు వచ్చారనేది  పోలీసుల డౌట్. దీంతో అడవులను జల్లెడ పడుతున్నారు. ఇన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న ఏజెన్సీ ఏరియాలో..పోలీసుల కూంబింగ్ తో  టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy