మావో భారీ విగ్రహాన్ని కూల్చేవేత

mavoఇటీవల చైనాలో నిర్మించిన మావో జెడాంగ్‌ భారీ విగ్రహాన్ని అధికారులు కూల్చేశారు. కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ 37 మీటర్ల భారీ విగ్రహాన్ని హెనాన్ ప్రావిన్స్ లోని టాంగ్జు కౌంటీలో ఏర్పాటు చేశారు. అయితే ఆ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి పర్మిషన్ లేదని అధికారులు దానిని కూల్చేశారు. మావో అభిమానులు, స్థానిక రైతులు, వ్యాపారవేత్తల నుంచి డొనేషన్లు వసూలు చేసిన లక్షలాది రూపాయలతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సిమెంట్, కాంక్రీట్ తో తయారు చేసిన ఈ విగ్రహానికి గోల్డ్ కలర్ తో పెయింట్ చేశారు. 37 మీటర్ల ఎత్తులో కుర్చీలో కూర్చునున్నట్లు ఉన్న మావో విగ్రహాన్ని రూపొందించారు. అయితే విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ దాన్ని కూల్చేశారు.

 

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy