మా ఇంటికి దారేది..?

AOC-475కంటోన్మెంట్ బోర్డు ప్రధాన విధి అక్కడి స్ధానికులకు, ఢిఫెన్స్ వాళ్ళకు మధ్య సమస్యల పరిష్కరించడం. జీహెచ్ఎంసీ లాగే స్థానిక ప్రజలను పాలిస్తోంది బోర్డు. దీని పరిధిలో ఆర్మీ ఏరియాతో పాటు సాధారణ పౌరులు ఏరియా కూడా ఉంటుంది. ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా… కచ్చితంగా బల్దియా లాగే కంటోన్మెంట్ బోర్టులో తీర్మానం చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడి రోడ్ల బంద్ కు ఇప్పటి వరకు కంటోన్మెంట్ బోర్టులో ఎలాంటి తీర్మానం చేయలేదు. అయినా ఆర్మీ అధికారులు ఏకపక్షంగా గేట్లు మూసేస్తున్నారు.

ఇది అన్యాయమంటూ స్థానికులు నాలుగేళ్ళ నుంచి ఉద్యమిస్తున్నారు. మూసివేసిన గేట్లు తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు కంటోన్మెంట్ కాని, అటు ఆర్మీ అధికారులు పట్టించుకోకపోవటంతో కోర్టు మెట్లు ఎక్కారు . అప్పటికే ఆర్మీ పరిధిలోకి ఎంట్రీ అయ్యే 12 గేట్లను మూసివేశారు.  1923 నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్న రోడ్లను మూసివేయటంతో జనం ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు కోర్టుకు విన్నవించారు. అయితే హైకోర్టు ఓ డైరెక్షన్ ఇచ్చింది. ప్రజలకు ప్రత్యామ్నాయ రూట్ చూపించే వరకు రోడ్లు మూసివేయొద్దని. ఇప్పటికే మూసేసిన రోడ్లు తెరవాలని 2014 సెఫ్టెంబర్ లో ఆదేశాలిచ్చింది హైకోర్టు.

కోర్టు ఆర్డర్ ను ఆర్మీ అధికారులు, కంటోన్మెంట్ బోర్డు బేఖాతరు చేసిందంటున్నారు స్థానికులు.  ఇదే విషయాన్ని2015లో కేంద్ర మంత్రి పారికర్ దృష్టికి తీసుకెళ్ళారు. ఆ సమావేశానికి దేశ వ్యాప్తంగా ఉన్న 62 కంటోన్మెంట్స్  అధికారులు, పౌర సంఘాల నేతలు హాజరయ్యారు.  కంటోన్మెంట్ బోర్డు మెంబర్ , ఎంపీ, ఎమ్మెల్యే , పౌర సంఘాల నేతలు ఈ సమావేశంలో ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సమస్యలను పారికర్ దృష్టికి తీసుకెళ్ళారు. కంటోన్మెంట్ 2006 యాక్ట్ లోని 258 సెక్షన్  అమలు చేయాలని పారికర్ కంటోన్మంట్ బోర్డును, ఢిఫెన్స్ అధికారులను ఆదేశించారు. ఈ అంశాన్ని బోర్డు మెంబర్లే ధృవీకరిస్తున్నారు.

డిఫెన్స్ మినిస్టర్ పారికర్ ఆదేశాలను పక్కాగా అమలు చేయాల్సిన బాధ్యత కంటోన్మెంట్ పై ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఆ లెటర్ తమకు అందలేదని కంటోన్మెంట్ సీఈఓ సుజాతా గుప్తా బుకాయిస్తున్నారని అంటున్నారు పౌర సంఘాల నేతలు.  బోర్డులో చర్చించకుండా కంటోన్మెంట్ రోడ్లు మూయడంపై ఇప్పటి వరకు కంటోన్మెంట్ సీఈవో స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సెక్షన్ 258 నే అమలు చేయాలని కేంద్ర మంత్రి ఆదేశించినా… CEO స్పందిచడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎంపీ మల్లా రెడ్డి ఇప్పటి వరకు పార్లమెంట్ లో ఈ ఇష్యూపై మాట్లాడలేదని అంటున్నారు. తాము కలిసి సమస్య పరిష్కరించాలని కోరినా  స్పందించడం లేదని స్థానిక నేతలు చెబుతున్నారు .

సెక్షన్ 258 అమలు చేయాలని కోర్టులు, ఢిఫెన్స్ అధికారులు, కేంద్ర మంత్రి చెప్పినా కంటోన్మెంట్ బోర్డు పట్టించుకోకపోవటం.. బోర్డు మెంబర్లు కూడా ఈ అంశాన్ని లేవనెత్తకపోవటంపై స్థానికులు మండిపడుతున్నారు. మీడియాకి కంటోన్మెంట్ సీఈఓ సుజాతా గుప్తా టైమ్ ఇవ్వకపోవటంతో అనుమానాలకు తావిస్తోంది. జనాన్ని పట్టించుకోకుండా కంటోన్మెంట్ బోర్డు మొత్తం ఆర్మీ వైపు ఉండి పక్షపాతంగా వ్యవహరిస్తోందని అంటున్నారు.  ఎవరూ పట్టించుకోక పోవడంతో స్థానికులు మళ్ళీ ఉద్యమానికి సిద్దమవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి రోడ్లు తెరిపించాలని డిమాండ్ చేస్తున్నారు కంటోన్మెంట్ చుట్టుపక్కల జనం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy