మా ఇళ్లను కూల్చేయకండి

03కుత్బుల్లాపూర్ సూరారం కాలనీలో.. ఇళ్ల ఖాళీ వ్యవహారం ఉద్రిక్తతకు కారణమవుతోంది. 20 ఏళ్లుగా వీకర్ సెక్షన్ కింద నివాసం ఉంటున్న 4 వేల 500 కుటుంబాల్లో… భారీ సంఖ్యలో అనర్హులు ఉన్నట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. వాళ్లను ఖాళీ చేయించేందుకు జేసీబీలతో సిద్ధమయ్యారు. కాలనీలో 4 రోజులుగా భారీ బందోబస్తును మోహరించారు.

మరోవైపు… హై కోర్టు కూడా కాలనీ నుంచి అనర్హులు ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. దీంతో.. కఠిన చర్యలకు అధికారులు ప్రిపేర్ అయ్యారు. ఈ విషయంపై బాధిత కుటుంబాలు ఆందోళన చేస్తున్నాయి. ఏళ్లుగా పిల్లాపాపలతో సూరారం కాలనీలో ఉంటున్న తమను.. ఖాళీ చేయించడం అన్యాయమని అంటున్నాయి.

0102

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy