‘మా’ తరపున మహిళలందరికీ క్షమాపణలు

movie-artists-associationసీనియర్ నటుడు చలపతిరావు వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించింది మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్. ఇది చాలా దురదృష్టకరమని.. దీనిపై చలపతి రావు ఆవేదన చెందుతున్నారన్నారు మా అధ్యక్షుడు శివాజీ రాజా. ఇంకో సారి తమ ఆర్టిస్టుల నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావని మాటిస్తున్నామన్నారు. ఇది కాదని ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే..సభత్యం రద్దు చేస్తామన్నారు. చలపతిరావు ఘటన తమకు ఒక గుణపాఠమన్నారు మా సెక్రటరీ నరేశ్. సభలో ఉన్నప్పుడు ఇలాంటివి జరగకుండా చూసుకుంటామన్నారు. చలపతి రావు షాక్ లో ఉన్నారని.. ఆయన్ను క్షమించాలి అని మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ తరుపున కోరుతున్నామన్నారు నరేశ్. గతంలో కూడా ఇలా జరిగాయని… వాళ్లను హెచ్చరించామన్నారు. ‘మా’ తరుపున మహిళలందరికి క్షమాపణలు చెబుతున్నామన్నారు నరేశ్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy