మా విద్యుత్తు తెలంగాణాకివ్వండి: దభోల్ పవర్ ప్లాంట్

dab

NTPC వారు తమ దభోల్ పవర్ ప్లాంట్ (రత్నగిరి గ్యాస్ అండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్) ద్వారా ఉత్పత్తి అయ్యే సుమారు రెండు వేల మెగా వాట్ల విద్యుత్తును కొత్తగా ఏర్పడబోయే తెలంగాణా రాష్ట్రానికి ఇవ్వాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసారు. తెలంగాణాకు అవసరమయ్యే విద్యుత్ ను కొత్త ప్రాజెక్టులు ఉత్పత్తి చేసే సరికి సుమారు ఐదేళ్ళు పట్టవచ్చని, ఈలోగా తమ విద్యుత్తును కొత్త రాష్ట్రానికి ఇవ్వమని NTPC కోరింది. NTPC, RGPPL, GAIL, మహారాష్ట్ర ప్రభుత్వం వాటాదారులుగా ఉన్న దభోల్ ప్లాంట్ ఈ సరఫరా ద్వారా వచ్చే నిధుల ఆసరాగా నష్టాలనుండి బయటపడాలనుకుంటుంది.

కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ వారు ఈ ప్రతిపాదన నిజమేకానీ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలియజేసారు.

భవిష్యత్ తెలంగాణా రాష్ట్ర విద్యుత్ అవసరాలు నేదునూరు లో ప్రతిపాదించిన గ్యాస్ ఆధారిత 21౦౦ మెగావాట్ల GENCO ప్లాంట్ ద్వారా కొంత తీరవచ్చుననుకుంటున్నా, ఈ ప్లాంటు పూర్తవడానికి సమయం పట్టవచ్చు. దీనికి గ్యాస్ కేటాయింపులు ఇంకా జరగలేదు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy