మింగేస్తే సరి : ఎక్సర్ సైజ్ ట్యాబ్లెట్స్ వస్తున్నాయ్

tablets-bodyమీరు అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్నారా..? స‌్థూల‌కాయంతో బాధ‌ప‌డుతూ వైద్యులు సూచించిన మేర‌కు వ్యాయామాలు చేయ‌డంలో ఇబ్బందులు ప‌డుతున్నారా..? అయితే అలాంటి వారికోస‌మే ఓ కొత్త ర‌క‌మైన మాత్ర‌ను క‌నుగొన్నారు శాండియాగోలోని స‌ల్క్ ఇన్స్‌టిట్యూట్ సైంటిస్ట్ రొనాల్డ్ ఇవాన్స్‌. ఈ పిల్‌ను క‌నుగొన్న రొనాల్డ్ ఇవాన్స్ ముందుగా ఎలుక‌ల‌పై ప్ర‌యోగించారు. ఈ మాత్ర‌ను ఎలుక‌ల‌కు ఇచ్చి ట్రెడ్‌మిల్‌పై ప‌రుగులు తీయించాడు. మొత్తం 270 నిమిషాల‌పాటు అల‌స‌ట అనేదే లేకుండా ఆ ఎలుకలు ట్రెడ్‌మిల్‌పై ప‌రుగులు తీశాయి. మ‌రోవైపు టాబ్లెట్ ఇవ్వ‌కుండా ప‌రీక్ష‌స్తే అదే ఎలుక‌లు 160 నిమిషాల‌కే అల‌సిపోయి ట్రెడ్‌మిల్‌పై నుంచి ప‌క్క‌కు వచ్చాయి.

అంతేకాదు ఎనిమిది వారాల పాటు ఈ ఎలుక‌ల‌కు ఇచ్చిన పిల్ చాలా బాగా ప‌నిచేసింద‌ని చెప్పిన రొనాల్డ్ ఇవాన్స్ …అధిక బ‌రువును నియంత్రించ‌డంతో పాటు బ్ల‌డ్ షుగ‌ర్ లెవెల్స్‌ను కూడా కంట్రోల్‌లో ఉంచింద‌ని చెప్పారు. మ‌నుషుల్లో కూడా ఇదే త‌ర‌హా రిజ‌ల్ట్ వ‌స్తుంద‌నే ఆశాభావం వ్య‌క్తం చేశారు ఇవాన్స్‌. ఈ మాత్ర‌లు నిరంత‌రాయంగా ఎలుక‌లు మీద ప్ర‌యోగించ‌డంతో అనేక విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. జ‌న్యుప‌రంగా కూడా ప‌లు మార్పులు చోటుచేసుకున్న‌ట్లు ప‌రీక్ష‌ల్లో తేలిన‌ట్లు ఇవాన్స్ తెలిపారు. కొవ్వును క‌రిగించ‌డంలో ఈ మాత్ర‌లు చాలా బాగా ప‌నిచేశాయ‌ని దీంతో ఎలుక‌లు మ‌రింత ఎన‌ర్జీని పొందాయ‌ని ఇవాన్స్ వివ‌రించారు. ర‌న్నింగ్ రేస్‌లో పాల్గొనే అథ్లెట్ల‌కు, సైకిలిస్ట్‌లకు ఇత‌ర‌త్రా ఫిజిక‌ల్ యాక్టివిటీస్‌లో పాల్గొనే వారు ఈ మాత్ర తీసుకుంటే శ‌రీరంలో అధికంగా ఉండే కొవ్వు త్వ‌ర‌గా క‌రిగిపోతుంద‌ని ఇవాన్స్ స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy