మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌ కు చేరిన సానియా జోడి

sania mirza_wimbledon  2007 (1)

ఆస్ట్రేలియన్ ఓపెన్‌ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-హోరియా టెకాయు (రుమేనియా) జోడి ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో  ఆస్ట్రేలియన్‌ జోడి జార్మిళ గాజ్డొసోవా-మాథ్యూ ఎబ్డెన్పై 2-6, 6-3,10-8తో గెలుపొందింది. గంటా 13 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో మొదటి సెట్ ఓడిపోయిన సానియా-టెకాయు జోడి తర్వాత అనూహ్యంగా పుంజుకుని విజయం సాధించింది.

ఈ టైటిల్ గెలిస్తే ఆమెకు రెండో టైటిల్ అవుతుంది. మహేష్ భూపతితో కలిసి 2009లో ఆమె ఆస్ట్రేలియన్ ఓపెన్‌ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలిచింది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy