మితిమీరుతున్న సెల్ ఫోన్ వినియోగం : యువత సర్వనాశనం..!

mobile_recruitingప్రస్తుతం మనిషికి నిత్యావసరాల్లో ప్రధమంగా ఉండేది సెల్ ఫోన్ అనే విషయం అందరిరీ తెలిసిందే. అయితే మితిమీరిన సెల్‌ఫోన్‌ వినియోగం యువతరాన్ని సర్వనాశనం చేస్తున్నట్లు శాన్‌డియాగో విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు వెల్లడించారు. ప్రస్తుత తరం యువత మానసిక ఆరోగ్యం మీద సెల్‌ఫోన్‌ చూపుతున్న ప్రభావం అంతా ఇంతా కాదని వారు వివరిస్తున్నారు. సోషల్‌ మీడియా కూడా యథాశక్తీ దీనికి దోహదపడుతోందంటున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో అమెరికాలోని ప్రతి నలుగురు యువతీయువకుల్లో ముగ్గురి వద్ద ఐఫోన్‌ ఉన్నట్లు తేలింది. వారు ఎక్కువసేపు ఫోన్‌తో కాలక్షేపం చేయటమే అధికంగా ఉంటోందని వెల్లడైంది.

మితిమీరిన వినియోగంతో చిక్కులు

* తరచుగా స్నేహితులను కలవటం, మాట్లాడుకోవటం తగ్గిపోతోంది. చాలామంది పార్టీలకు కూడా వెళ్లటం లేదు, విహార యాత్రలపై ఆసక్తి లేదు.

* తల్లిదండ్రులతో కలిసి ఎక్కడైనా బయటకు వెళ్లే సందర్భాలు దాదాపు లేనట్లే. ఒకే ఇంట్లో ఉంటున్నా తల్లిదండ్రులకు వారు మానసికంగా దగ్గర కాలేకపోతున్నారు. తల్లిదండ్రులు ఏదైనా చెప్పబోతున్నా సరే సరేలే.. అని దాటవేసి సెల్‌లో లీనమైపోతున్నారు.

* కుంగుబాటు సర్వసాధారణ సమస్యగా మారింది. ఆత్మహత్యల సంఖ్య అధికం అయింది. అమెరికాలోని యువకుల్లో కుంగుబాటు సమస్య 2012 నుంచి 2015 మధ్యకాలంలో 21 శాతం పెరిగింది. యువతుల్లో అయితే 50 శాతం మేరకు పెరిగింది. ఆత్మహత్యల సంఖ్య ఆందోళనకరంగా పెరిగిపోయింది. యువతులు ఆత్మహత్యల రేటు ఎంతో అధికంగా ఉంది. 2007తో పోల్చితే 2015 లో 14 ఏళ్ల యువతులు ఆత్మహత్యలు చేసుకోవటం మూడు రెట్లు పెరిగింది. యువకుల్లో ఆత్మహత్యల రేటు కంటే ఇది రెట్టింపు.

* మానవ సంబంధాలు తగ్గిపోవటం ఒంటరితనానికి దారితీసి కుంగుబాటులో ఆత్మహత్య చేసుకోవాలని యోచిస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy