మిత్రపక్షాలకు మరోసారి నితీష్‌ షాక్

nitish kumarబిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మిత్రపక్షాలకు మరోసారి షాకిచ్చారు. మొన్న రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఝలక్‌ ఇచ్చిన నితీష్ ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో కూడా అలాగే చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో నిలబెట్టే అభ్యర్థిపై నిర్ణయం తీసుకునేందుకు ఎన్డీయేతర పక్షాలన్నీ కూడా మంగళవారం భేటీ అవ్వాలని నిర్ణయించుకోగా ఆ సమావేశానికి తాను హాజరుకావడం లేదని చెప్పారు నితీష్‌. దీంతో మరోసారి అసలు నితీష్‌ మనసులో ఏముందని, ఆయన ఇక మిత్రపక్షాలకు పూర్తిగా దూరమైనట్లేనా అన్న చర్చలు కొనసాగుతున్నాయి.

గతంలో కూడా రాష్ట్రపతి అభ్యర్థిపై ఏర్పాటుచేసిన సమావేశానికి నితీష్‌ డుమ్మా కొట్టారు. దీనిపై కాంగ్రెస్‌ నేతలంతా నితీష్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఆయనపై విమర్శలు చేయవద్దని, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో తమకే మద్దతు ఇస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులకు వివరించారు AICC ఉపాధ్యక్షుడు రాహుల్‌. అయితే  తాజాగా నితీష్‌ మనస్సు మార్చుకొని ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే సమావేశానికి తాను హాజరుకాబోనంటూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం నితీష్‌కు వైరల్‌ ఫీవర్‌ ఉందని, ఆ కారణంగానే ఆ సమావేశానికి హాజరుకావడం లేదంటున్నారు సీఎం  కార్యాలయ వర్గాలు. ఇదిలా ఉండగా, లాలూ ఇంటిపై సీబీఐ దాడుల విషయంలో స్పందించేందుకు నిరాకరించారు నితీష్‌.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy