మిథాలీకి అరుదైన గౌరవం..!

raj-pti-mప్రపంచకప్ ఫైనల్ లో ఓడినా..కోట్లాది మంది మనసుల్లో స్థానం సంపాదించుకున్న భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. 2017 ICC మహిళా వరల్డ్‌ కప్‌ జట్టు కెప్టెన్‌గా ఆమెను ఐసీసీ ఎంపిక చేసింది. ముగిసిన వరల్డ్‌ కప్‌లో భారత జట్టును తన నాయకత్వంలో ఫైనల్‌కు చేర్చిన 34 ఏళ్ల మిథాలీకి ఈ గొప్ప గౌరవాన్ని కట్టబెట్టింది. ఆదివారం (జూలై-23) లార్డ్స్‌లో ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన ఫైనల్‌ పోరులో తొమ్మిది పరుగుల తేడాతో భారత జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే.

కెప్టెన్సీకి మారుపేరుగా నిలిచిన మిథాలీ బ్యాటింగ్‌లోనూ అసాధారణంగా రాణించి 409 పరుగులు చేసింది. అత్యంత కీలకమైన న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 109 పరుగులు చేసి జట్టుకు 186 పరుగుల భారీ విజయాన్ని అందించింది. ఈ విజయంతో భారత్‌ సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకుంది. మిథాలీతోపాటు అద్భుతంగా రాణించిన భారత మహిళా క్రికెటర్లు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, దీప్తిశర్మ కూడా ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించారు. తాజా వరల్డ్‌ కప్‌లో అద్భుతంగా రాణించిన క్రికెటర్ల గౌరవార్థం ప్రకటించిన ప్రపంచకప్‌ జట్టులో నలుగురు ఇంగ్లండ్‌ క్రికెటర్లు చోటు సంపాదించుకున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy