మిథాలీకే… ICC వాల్డ్ కప్‌ జట్టు కెప్టెన్సీ

mithali rajభారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ 34 ఏళ్ల మిథాలీ రాజ్‌ క్రీడా ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. దీంతో ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. 2017 ICC మహిళా వాల్డ్ కప్‌ జట్టు కెప్టెన్‌గా మిథాలీని ICC ఎంపిక చేసింది.

తాజాగా ముగిసిన వాల్డ్  కప్‌లో భారత జట్టును తన నాయకత్వంలో ఫైనల్‌కు చేర్చిన మిథాలీకి ఈ గొప్ప గౌరవాన్ని కట్టబెట్టింది. కెప్టెన్సీకి మారుపేరుగా నిలిచిన మిథాలీ బ్యాటింగ్‌లోనూ అసాధారణంగా రాణించి 409 పరుగులు చేసింది.

మిథాలీతోపాటు అద్భుతంగా రాణించిన భారత మహిళా క్రికెటర్లు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, దీప్తిశర్మ కూడా ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించారు. క్రికెటర్ల గౌరవార్థం ప్రకటించిన ప్రపంచకప్‌ జట్టులో నలుగురు ఇంగ్లండ్‌ క్రికెటర్లు చోటు సంపాదించుకున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy