మిథాలీని ఘనంగా సన్మానించిన HCA

sssఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ ఎందరికో స్పూర్తిగా మారారన్నారు HCA అధ్యక్షుడు వివేకానంద్. మిథాలీని ప్రత్యేకంగా సన్మానించిన HCA… ఐదు లక్షల రూపాయల నగదు బహుమతిగా అందిచింది. అటు HCA కల్పిస్తున్న వసతులను ఉపయోగించుకొని ముందుకు పోవాలన్నారు మిథాలి.

ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ ను ఘనంగా సన్మానించింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి HCA అధ్యక్షుడు వివేకానంద్, రిటైర్డ్ జడ్డి జస్టిస్ సీతాపతి, HCA మాజీ అధ్యక్షుడు వినోద్ తో పాటు అపెక్స్ కౌన్సిల్ మెంబర్లు పాల్గొన్నారు.

ఉమెన్ వాల్డ్ కప్ లో టీమిండియాను ఫైనల్స్ కు చేర్చడంలో మిథాలీ రాజ్ మేజర్ రోల్ ప్లే చేసిందన్నారు HCA అధ్యక్షుడు వివేకానంద్. యంగ్ జనరేషన్ కు మిథాలీ స్ఫూర్తిగా మారారని అన్నారు. విమెన్ క్రికెటర్స్ కు చేయూత నిచ్చేందుకు HCA ఎప్పుడూ ముందుంటదన్నారు. ఉమెన్ ఇండియా క్రికెట్ టీమ్ వాల్డ్ కప్ గెలవకపోయినా…కోట్లాది జనం మనసులు గెల్చుకున్నారన్నారు రిటైర్డ్ జడ్డి జస్టిస్ సీతాపతి. భవిష్యత్ లో మరింతగా రాణించాలని అన్నారు.

HCA, కోచ్ ల కృషి వల్లే.. తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు మిథాలీ రాజ్. క్రికెట్ ప్రాక్టీస్ చేసుకునేతందుకు.. మంచి స్టాండర్డ్స్ ను, వసతులను HCA తీసుకొచ్చిందని అన్నారు. హైదరాబాదీలు అందరూ.. వీటిని ఉపయోగించుకుని.. భవిష్యత్ లో రాణించాలన్నారు మిథాలీ.  అభినందన సభ సందర్భంగా మిథాలీ రాజ్ కు ఐదు లక్షల రూపాయల నగదు బహుమతి అందజేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy