మిరాకిల్ బేబీ: పుట్టినప్పుడు పావు కేజీయే

ballచనిపోతుందన్నారు.. శ్మశానంలో కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ఆ కన్నతల్లి ప్రేమ ముందు అవన్నీ బలాదూర్ అయ్యాయి. ఆమె నమ్మకమే.. ఆ చిన్నారికి ప్రాణం పోసింది. పుట్టిన క్షణం నుంచి ప్రాణాల కోసం పోరాడుతూ.. ప్రతి నిమిషం వెంటిలేటర్లతో ఊపిరి పీల్చుకుంటూ.. చివరికి తన ప్రాణాలను నిలబెట్టుకుంది ఆ చిన్నారి. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్ కు చెందిన  హెన్నా విక్స్.. పాపీ దంపతులకు ఓ పాప జన్మించింది. సాధారణంగా 9నెలలకు జన్మించాల్సిన శిశువు.. 6 నెలలకే పుట్టింది. ఆ చిన్నారి బరువు పావు కేజీకి కాస్త పైన(360 గ్రాములు) ఉంది. పొడవు 14 సెం.మీ. అయితే కాళ్లు, చేతులు ముడుచుకుంటే ఆ పాప.. టెన్నీస్ బాల్ అంత సైజుకి మారిపోతుంది. దీంతో ఈ  పాప బతకడం కష్టమేనని తేల్చారు డాక్టర్లు. ఇది ఈ ఏడాది మార్చి 9న జరిగింది. ఆ పాపను చూసి షాక్ అయ్యారు తల్లిదండ్రులు. డాక్టర్ల మాటలతో పాప కోసం చేసే షాపింగ్ కూడా మానేశామని చెప్పారు ఆ చిన్నారి తండ్రి. ఆపరేషన్ చేస్తామని చెప్పిన క్షణమే శ్మశానంలో కూడా ఏర్పాట్లు చేశామన్నారు.

అయితే అద్భుతం జరిగింది. చనిపోతుందనుకున్న పాప దాదాపు 4 నెలలు హాస్పిటల్ లో ప్రాణాల కోసం పోరాడి బతికింది. నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణ.. ఆ చిన్నారిని కన్న తల్లి ప్రార్థనలు ఫలించి… ఆరోగ్యంగా ఇంటికి చేరింది. దీంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు పాప తల్లిదండ్రులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy