‘మిర్చి లాంటి కుర్రాడి’ కోసం బాలయ్య..!

‘మిర్చి  లాంటి కుర్రాడు’ కోసం బాలయ్య  రానున్నాడు. త్వరలోనే రిలీజ్ అయ్యే ఈ మూవీ ఆడియో ఫంక్షన్ కు బాలయ్య గెస్ట్ గా రానున్నాడు. రుద్రపాటి రమణారావు నిర్మాతగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.  హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆడియో రిలీజ్ చేయనున్నారు. ఈ ఫంక్షన్ కు లెజెండ్ హీరో బాలకృష్ణ వస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న మూవీకి కూడా రుద్రపాటి రమణారావే నిర్మాత. దీంతో నిర్మాత రిక్వెస్ట్ చేయడంతో బాలయ్య ఆడియో ఈవెంట్ కు వస్తున్నట్లు మూవీ యూనిట్ చెప్పింది. ఈ నెల 13న ‘మిర్చి లాంటి కుర్రాడు’ మూవీ ఆడియో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు నిర్మాత. ఎస్.ఎల్వీ బ్యానర్ పై అభిజిత్ హీరోగా ఈ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీతో జయనాగ్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ కానున్నాడు. ప్రగ్వ జైస్వాల్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.  ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మూవీ తీశామని నిర్మాత రమణారావు చెప్పారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy