మిర్యాలగూడలో రూ.4లక్షలు స్వాధీనం : పోలీసులను చూసి రోడ్డుపక్కన పడేశారు

మిర్యాలగూడ: నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో గుర్తు తెలియని వ్యక్తులు ఇవాళ సాయంత్రం డిసెంబర్-6న ఓటర్లకు పంచడానికి తీసుకెళ్తున్న డబ్బులను రోడ్డు మీద పడేశాడు. Kp. 4 లక్షల దాకా ఉన్నాయి. వాటిని గుర్తించిన వన్‌ టౌన్ పోలీసులు.. ఆ డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సదానాగరాజు తెలిపారు.  మిర్యాలగూడలోని ఈదుల్ గూడ చౌరస్తా వద్ద కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఓ వ్యక్తి నుంచి 47 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆ డబ్బుకు సంబంధించి ఆ వ్యక్తి దగ్గర ఎటువంటి ఆధారం లేకపోవడంతో అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy