మిసెస్‌‌ ఇండియా ఫైనల్స్‌లో అజయ్‌ భార్య 

swetha-Ajayపెళ్లి, పిల్లల  తర్వాత మహిళలు ఫిట్‌గా ఉండటం అంత ఈజీ పనికాదు. అందంపై దృష్టి పెట్టడానికి తీరిక ఉండదు. కానీ ఈ అడ్డంకులన్నింటినీ దాటారు టాలీవుడ్‌ నటుడు అజయ్‌ భార్య శ్వేత రావూరి. ‘హాట్‌ మోంద్‌’ నిర్వహించిన 2017 మిసెస్‌‌ ఇండియా వరల్డ్‌ వైడ్‌ పోటీల్లో దేశవ్యాప్తంగా వచ్చిన గట్టి పోటీని ఎదుర్కొని టైటిల్ రేసులో నిలిచారు. ఫైనల్ బెర్తును సాధించారు.

ఈ విషయాన్ని అజయ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. తన భార్య చివరి రౌండ్‌కు ఎంపిక కావడం సంతోషంగా… గర్వంగా ఉందన్నారు. ఆమె ఫేస్‌బుక్‌ పేజీని షేర్‌ చేస్తూ.. ఫైనల్‌లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. తాను ఈ పోటీల్లో నిలవడం.. ఫైనల్ దాకా వెళ్లడం వెనక అజయ్ ప్రోత్సాహం ఎంతో ఉందని అన్నారు శ్వేత. ఆ క్రెడిట్ అంతా తన భర్తకే దక్కుతుందని అన్నారు. అజయ్-శ్వేత దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy