మిస్టరీ ఏంటీ : పెళ్లికి రెండు రోజుల ముందు యువకుడి హత్య

mystryమరో రెండు రోజుల్లో పెళ్లి… బంధువులను పిలవడానికి వెళ్లి అక్కడే అనుమానస్పదస్థితిలో మంటల్లో కాలిపోయి శవమై కనిపించాడు ఓ యువకుడు. ఈ దారుణమైన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన దాన్నే రమేష్(25) ఆదివారం(మే-6) ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లి-పటేల్ గూడ గ్రామానికి వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చేందుకు వెళ్లాడు. ఏమయిందో ఏమో తెలియదుకానీ ఈ నెల 9వ తేదీన పెళ్ళికొడుకు కావాల్సిన రమేష్ తన బంధువుల వ్యవసాయ పొలం దగ్గర ఒళ్ళంతా కాలిన స్థితిలో చనిపోయి కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు. బండరాయి తో కొట్టి, పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ క్లూ టీం తో  హత్యకు గల కారణాల వివరాలు సేకరిస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy