
2 నిమిషాల 8 సెకన్లున్న ట్రైలర్ లో.. హీరోయిన్ ఏది చేస్తే అదే ఫాలో అవుతుంటాడు అఖిల్. నిధికి కోపం వచ్చి, నువ్వెంత ట్రై చేసినా నేను పడను అంటుంది. అఖిల్ థాంక్స్ అంటాడు. థాంక్స్ ఎందుకు అని నిధి అడుగుతుంది. నేను హాయిగా ఇంకో అమ్మాయిని ట్రై చేసుకుంటాను అని అఖిల్ చెప్పడం ఫన్నీగా ఉంది.
అఖిల్, నిధి మధ్య కెమిస్ట్రీని చాలా అందంగా చూపించారు. ‘నా కోసం ఎవరైనా ఏడిస్తే అది నా తప్పు కాదు. కానీ.. నా వల్ల ఒక్కరు ఏడ్చినా కచ్చితంగా అది నా తప్పు అవుతుంది’ అని అఖిల్ నిధితో అంటున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ చివర్లో ‘ప్రేమ అంటే.. ఎక్కువ రోజులు ప్రేమించుకుని, ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువగా ప్రేమించుకుని లాస్ట్ లో పెళ్లిచేసుకోవడం లాంటిదా’ అని అఖిల్ నిధిని అడుగుతాడు. నిధి అవునంటుంది. ‘చచ్చాను.. అలా ప్రేమించడం నా వల్ల కాదు’ అని అఖిల్ చెప్పడం ఫన్నీగా ఉంది. ఇప్పటికే రిలీజైన టీజర్, పోస్టర్స్ ఆకట్టుకుంటుండగా..ట్రైలర్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచిందంటున్నారు ఫ్యాన్స్. బీవీఎన్ఎన్ ప్రసాద్ నిర్మించిన మిస్టర్ మజ్ను రిపబ్లిక్ డే కానుకగా జనవరి-25న రిలీజ్ కానుంది.
Here’s the Mr.Manju trailer for you guys https://t.co/aaPXwUys3U #MrMajnu #MrMajnuOnJan25th
— Akhil Akkineni (@AkhilAkkineni8) January 19, 2019