మిస్డ్ కాల్ ఇస్తే చాలు : మహిళలకు రక్షణగా యాంటీ రెడ్ ఐ

antiస్పై కెమెరాలు మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని.. ఈ కెమెరాల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని సినీ నటి సనా అన్నారు. దీనిపై ప్రతి ఒక్కరిలో అవేర్ నెస్ తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే.. యాంటీ రెడ్ ఐ పేరుతో మిస్ట్ కాల్ (8099259925) క్యాంపెయిన్ చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ సీక్రెట్ కెమెరాలు ఆన్ లైన్ లో రూ. 250కే లభిస్తున్నాయని.. దీంతో ఎంతో మంది వీటిని సొంతం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టూత్ బ్రష్, షాంపు బాటిల్స్ లోనూ సులువుగా స్పై కెమెరాలు పెట్టేస్తున్నారన్నారు. ఈ కెమెరాలను దుర్వినియోగం చేస్తూ మహిళల జీవితాలను నాశనం చేస్తున్నారని తెలిపారు. తుపాకులకు లైసెన్సులు ఇస్తున్నట్టుగానే.. ఈ కెమెరాలకూ లైసెన్స్ లు తప్పనిసరి చేయాలని రిక్వెస్ట్ చేశారు.

ఈ క్యాంపెయిన్ కు హీరోయిన్లు కాజల్, సమంత, మెహ్రీన్ సపోర్టుగా నిలిచారు. మహిళలపై స్పై కెమెరాలతో.. సీక్రెట్ గా షూట్ చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత బెదిరింపులు పెరుగుతున్నాయని, దీన్ని అరికట్టేందుకు ఈ అవేర్ నెస్ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు కాజల్. ఎవరికైనా ఇలాంటి ఘటనల బారిన పడే మహిళలు 80 9925 9925 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తేచాలు..వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సమంత.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy