మిస్ వరల్డ్ గా హర్యానా బ్యూటీ

haryanaభారతీయ యువతి, హర్యానాకు చెందిన వైద్య విద్యార్థిని మనుషి చిల్లార్(20) మిస్ వరల్డ్‌గా ఎంపికైంది. బ్రెయిన్ విత్ బ్యూటీగా పేరుగాంచిన మనుషి ఈ సంవత్సరం ప్రథమార్థంలో మిస్ ఇండియా-2017గా ఎంపికైన విషయం తెలిసిందే. చైనాలోని సన్యా సిటీ, అరెనాంలో 67వ మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ జరిగింది.

108 దేశాల నుంచి అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అందరిని వెనక్కినెట్టి విజేతగా నిలిచిన మనుషి చిల్లార్‌కు మిస్ వరల్డ్-2016 విన్నర్ స్టెఫానే డెల్‌వాలే కిరీటాన్ని బహుకరించింది. మిస్ వరల్డ్‌గా ఎంపికవడం అనేది తన చిన్ననాటి కల అని ఆమె ఈ సదర్భంగా వెల్లడించింది. విజేతగా ఎంపికవడం అనేది ఒక ప్రయాణమని.. దాన్ని తానెప్పుడు మరచిపోనన్నారు. ఈ ప్రయాణంలో తానెంతో నేర్చుకున్నట్లు, ఎంతో సంతోషం పొందినట్లు.. ఫలితాన్ని మాత్రం విధికి వదిలేసినట్లు తెలిపింది మనుషి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy