మీకు అర్హత ఉందా: ఈ కంపెనీల్లో 30 లక్షల ఉద్యోగాలు

telecomఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. అన్ని అర్హతలున్నా జాబ్స్ రాక నిరుత్సాహంతో ఉన్న యువత ఇకపై నిరాశ చెందాల్సిన అవసరం లేదు. 2018 లోగా 30 లక్షల ఉద్యోగాలను బర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది టెలికాం రంగం. దీనికి తగిన అర్హతలు మీకుంటే..ఉద్యోగం ఇక మీ సొంతం అయినట్లే.

4జీ టెక్నాలజీ ఆవిష్కరణ.. డేటా వాడకం పెరగటం, కొత్త ఆపరేటర్లు మార్కెట్‌లోకి ఎంట్రీ, డిజిటల్‌ వాలెట్ల ప్రవేశం, స్మార్ట్‌ఫోన్‌కు రోజురోజుకు పాపులారిటీ పెరగడం, టెక్నాలజీకి మునుపెన్నడూ లేని విధంగా డిమాండ్‌ వచ్చింది. దీంతో టెలికాం రంగంలో కొత్తకొత్త ఉద్యోగాలను బర్తీ చేసేందుకు రెడీ అవుతోంది. 2018 లోగా ఈ రంగంలో 30 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగనుంది. ఎమర్జింగ్‌ టెక్నాలజీలు 5జీ, ఎం2ఎం, ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీలలో పరిణామాలు కూడా ఈ రంగంలో భారీగా ఉద్యోగవకాశాలు కల్పించనున్నాయని అసోచామ్‌,కేపీఎంజీ సంయుక్త అధ్యయనం తెలిపింది. 2021 నాటికి వీటిలో కూడా 8,70,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఈ సంయుక్త అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న ఉద్యోగులు సంఖ్యాపరంగా, అప్‌కమింగ్‌ డిమాండ్‌ తగ్గ నాణ్యత పరంగా సరిపోరని చెప్పింది. దీంతో ఉద్యోగవకాశాలు పెరుగనున్నట్లు తెలిపింది.

నైపుణ్యాల పరంగా ఉన్న లోటును పూరించడానికి, ఇన్‌ఫ్రా, సైబర్‌ సెక్యరిటీ నిపుణులు, అప్లికేషన్‌ డెవలపర్లు, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లు, ఇన్‌ఫ్రాక్ట్ర్చర్‌ టెక్నిషియన్స్‌, హ్యాండ్‌సెట్‌ టెక్నిషియన్స్‌ వంటి విభాగాల్లో నైపుణ్యాలున్న ఉద్యోగులను గుర్తించాలని నిర్ణయించింది. అంతేకాదు ప్రస్తుత టెక్నాలజీలో పనిచేస్తున్న ఉద్యోగులను, రాబోయే అవసరాలకు అనుకుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అసోచామ్‌,కేపీఎంజీ అధ్యయనం తెలిపింది. టెలికాం రంగంలో అవసరమయ్యే నైపుణ్యాలు, డిమాండ్‌ కోసం టెలికాం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ నియమింపబడింది. సబ్‌స్క్రైబర్‌ విషయాన్ని తీసుకుంటే సమ్మేళన వార్షిక వృద్ధి రేటులో టెలికాం రంగం 19.6 శాతం వృద్ధిని నమోదుచేసింది. రెవెన్యూ పరంగా గత కొన్నేళ్లలో ఈ వృద్ధి 7.07 శాతంగా ఉంది. టెలికాం సర్వీసు ప్రొవైడర్లు కూడా తమ నెట్‌వర్క్‌లలో కొనసాగింపుగా పెట్టుబడులు పెడుతున్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy