మీకేం పోయేకాలం : ఇంద్రకీలాద్రి మహిళా డార్మిటరీల్లో సీసీ కెమెరాలు

cc-tvవిజయవాడ ఇంద్రకీలాద్రిలోని సి.వి.రెడ్డి ఛారిటీస్ ట్రస్టు డార్మిటరీలో మహిళలు దుస్తులు మార్చుకునే రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలలుగా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. మహిళలు ఉండే గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

ఈరోజు ఓ పెళ్లి బృందం సీసీ కెమెరాలను గుర్తించి అధికారుల దృష్టికి తెచ్చింది. అయితే ఈ సంఘటనపై ఆలయ సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. కెమెరాలకు కనెక్షన్‌ ఇవ్వలేదని, అంతేకాకుండా మూడు రోజుల నుంచి పనిచేయడం లేదని అంటున్నారు. ఈ ఘటనకు అధికారులను, సిబ్బందిని పూర్తి బాధ్యులను చేసి మరే దేవాలయంలో ఈలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు భక్తలు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy