మీకో నమస్కారం : నేను పవన్ భార్యను కాదు

pawan-renuపవన్ కల్యాణ్ భార్యను నేను కాదు.. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోండి అంటూ ఆవేదనతో వేడుకుంటోంది ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్‌. నాలుగేళ్లుగా ఫేస్‌బుక్, ట్విట్టర్‌ లాంటి సోషల్‌ మీడియాలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వరసగా అభ్యర్థనలు, విన్నపాలు ఎడతెరిపి లేకుండా పెడుతున్నారు. తాను ఇంటర్వ్యూల్లో, సోషల్‌ మీడియాలో ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా.. అలాగే పోస్ట్‌ చేస్తున్నారు. అందుకే  మిత్రులకు, తన శ్రేయోభిలాషులందరికీ నమస్కారం చేసి మరోసారి వివరణ ఇస్తున్నానన్నారామె.

“కల్యాణ్‌ గారు నాలుగేళ్ల క్రితం ‘ఆనా’ను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక చక్కటి కూతురు కూడా ఉంది. ఆయన వివాహ బంధాన్ని, ఆయన కుమార్తెకు జన్మనిచ్చిన తల్లిని గౌరవిస్తూ నేను మీకు చేసుకునే విన్నపం ఒక్కటే. నేను, కల్యాణ్‌గారు తిరిగి ఏకం కావాలని మీరు పదేపదే కోరుకుంటున్నారు. అది జరగని పని. అదేంటంటే కల్యాణ్‌గారి భార్య ‘ఆనా’.. నేను కాదు. ఒకటి మాత్రం నిజం. ఆయన నా పిల్లలకు తండ్రి. నేనూ ఆయన మంచి స్నేహితులం మాత్రమే. కానీ మేమెప్పటికీ తిరిగి భార్యాభర్తలం కాలేము. ఈ సత్యాన్ని నేను మనసా, వాచా, కర్మణా అంగీకరిస్తున్నాను. ఈ విషయాన్ని అర్థం చేసుకుని, నన్ను కల్యాణ్‌ దగ్గరకు వెళ్ళమని కోరవద్దు” అంటూ రేణూ దేశాయ్‌ వేడుకుంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అయినప్పటికీ ‘మీరెంతైనా మా అన్న వైఫ్‌ కాబట్టి, మీ ఇద్దరూ కలవాలని కోరుకుంటాం. మిమ్మల్ని ఎప్పటికీ మా ‘వదిన’లానే భావిస్తాం’ అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తూ పోస్ట్‌ చేయడం విశేషం.

Andariki namaskaramNaalugelluga facebook, twitter laanti social media dwara Na vyakthigatha jeevithaaniki…

Renu Desai 发布于 2017年6月30日周五

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy