మీడియాపై పవన్ కల్యాణ్ బౌన్సర్ల దాడి

pawan fnlపిలవని పేరంటానికి ఏమీ వెళ్లలేదు.. హడావిడిగా ఏమీ దూసుకువెళ్లలేదు.. ఆగమంటే ఆగారు.. అయినా దౌర్జన్యం చేశారు.. ఇదేమని ప్రశ్నిస్తే కొట్టారు.. భారీ పర్సనాలిటీ ఉన్నాయి కదా అని.. బలం ఉంది కదా అని.. వీడియో జర్నలిస్టులపై విచక్షణారహితకంగా దాడిచేశారు.. ఎందుకు కొడుతున్నారని అడిగినా వినకుండా.. వినే ఓపిక లేకుండా.. ఇష్టానుసారం బాదేశారు.. హైదరాబాద్ నానక్ రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో జరిగిన ఘటన ఇది. ఏపీ రాజధాని శంకుస్థాపన కోసం ఇన్విటేషన్ల ఇచ్చేందుకు ఏపీ మంత్రులు.. స్టూడియోలోని పవన్ దగ్గరకు వెళ్లారు. స్టూడియో బయటే వీడియో జర్నలిస్టులను నిలిపేశారు. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు స్టూడియో నుంచే బయటకు వెళ్లిపోవాలని.. సెట్స్ పరిసరాల్లో కూడా ఉండొద్దంటూ పవన్ బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. వెళతాం.. వెళతాం అని చెప్పినా వినకుండా.. దాడికి దిగారు. వి6 కెమెరామెన్ కు గాయాలయ్యాయి. కెమెరాలు ధ్వంసం అయ్యాయి. దీనిపై వీడియో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బౌన్సర్లపై చర్యకు డిమాండ్ చేస్తున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy