మీరట్ వీధుల్లో చిరుత

మీరట్ పట్నంలో ఓ చిరుతపులి తిరుగుతోంది. దీనితో పట్నంలోని స్కూళ్ళు, కాలేజీలు మూసేశారు. మార్కెట్లు కూడా మూతపడ్డాయి. వీధుల్లోకి రావడానికి జనం భయపడుతున్నారు. పులిని పట్టుకోవడానికి ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆదివారం పొద్దున చిరుత ఒక గోడౌన్లో చొరబడింది. గొడౌన్లోకి వెళ్తున్న ఓ అబ్బాయిమీద దాడి చేసి గాయపరిచింది. ఆ తరువాత అక్కడి ఆర్మీ కంటోన్మెంట్ హాస్పిటల్లో ఒక రూమ్ లోకి దూరిపోయింది. ఈరోజు ఉదయం వరకు అక్కడే ఉంది. దాన్ని పట్టుకోడానికి ప్రయత్నం చేస్తే, అద్దాలు పగలగొట్టి పారిపోయింది. హాస్పిటల్ బయట మరొకతనిమీద కూడ దాడి చేసింది. తరువాత ఓ సినిమాహాల్లోకి చొరబడినటట్ చెప్తున్నారు. చిరుత ఎక్కడుందో తెలుసుకోడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy