మీరిచ్చిన స్ఫూర్తితో దేశానికి మంచి చేస్తా: సీఎం కేసీఆర్

cm-1
దేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ అన్నారు సీఎం కేసీఆర్. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపిన తర్వాత ఇప్పుడు దేశ రాజకీయాలపై దృష్టి సారించే స్థితికి చేరుకున్నామన్నారు. జాతీయ రాజకీయాలలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇది చాలా ముఖ్యమైందన్నారు.  దేశంలో గుణాత్మక మార్పు కోసం ఏదైనా చేయాలని భావించి ఒక ప్రకటన చేశానని కేసీఆర్ అన్నారు. తాను చేసిన ఒక్క ప్రకటన ప్రకంపనలు సృష్టించిందన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తనను మోడీ ఏజెంట్ అంటున్నారన్నారు. ఇక బీజేపీ వాళ్లయితే ఈ ఫ్రంట్ కు టెంటే లేదని అంటారని…టెంటే లేకపోతే మీకు భయమెందుకని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ అంటే భయం…ఆయన జెండా ఎత్తితే సాధించే వరకూ వెనుదిరగరని వారికి భయం అని కేసీఆర్ అన్నారు. ఎలా అయితే తెలంగాణను నిజం చేసి చూపించానో… అదే విధంగా దేశంలో గుణాత్మక మార్పు తీసుకువచ్చేందుకు మడమ తిప్పని పోరాటాన్ని చేస్తానని కేసీఆర్ అన్నారు.

దేశంలో నీటి యుద్ధాలకు కారణం కేంద్రంలో ఇంత కాలంగా పాలన చేస్తూ ఉన్న ఆ రెండు పార్టీల అసమర్థ పాలనే అని కేసీఆర్ విమర్శించారు. దేశంలో ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ అధికారంలో వచ్చే డిఫాల్ట్ పాలిటిక్స్ కారణంగానే ఈ పరిస్థితి ఇలా తయారైందన్నారు. కర్నాటకలో ఎన్నికలు జరుగుతున్నందున కావేరీ జలాలపై ఈ రెండు పార్టీలూ డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. ఏమైనా అంటే దేశంలో నీటి యుద్ధాలు అంటారనీ, మీ అసమర్థ పాలన వల్లే నీటియుద్థాలు జరుగుతున్నాయని విమర్శించారు. దేశంలో 70 వేల TMC నీళ్లున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పరుగులు పెడుతుంటే కాంగ్రెస్ నేతలు తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు. ప్రోజెక్టులను అడ్డుకోవడానికి 250 కేసులు వేశారన్నారు సీఎం కేసీఆర్.

దేశ ప్రజలను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మోసం చేస్తున్నాయన్నారు. రాష్ట్రాలను మున్సిపాలిటీల కంటే హీనంగా చూస్తున్నారన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, పట్టాణాభివృద్ది, తాగునీటి వసతి, ఆరోగ్యం కేంద్రం దగ్గర ఎందుకని నిలదీశారు. ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన.. మీకు అవసరమా? రోడ్లు వేసేందుకు సర్పంచ్, ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ లేదా? అని ప్రశ్నించారు. నరేగా కూలీలకు పోస్టాఫీసులో వేసే దుస్థితి నెలకొని ఉందన్నారు సీఎం.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy