మీరొస్తామంటే.. మేమొద్దంటామా

chandrababu-naidu-good-news-647x450ఏపీలో పుట్టి ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారి స్థానికత విషయంలో స్పష్టత ఇచ్చేందుకు రెడీ అవుతోంది ఆ రాష్ట్ర సర్కార్. దీనికోసం కొత్త నిర్ణయాలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. కీలకమైన స్థానికత విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు స్పీడ్ పెంచింది. అది ఉద్యోగులైన సరే… సాధారణ ప్రజలైనా సరే. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు రెడీ అయిన వాళ్లకు… కోరుకున్న చోట స్థానికత హోదా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. తమ వివరాల ఆధారంగానే తమ పిల్లలకూ స్థానికత ఫైనల్ చేయాలని ఉద్యోగుల నుంచి వచ్చిన సూచననే.. బాబు సర్కార్ పరిశీలనలోకి తీసుకుంది.

ఉద్యోగులు, వాళ్ల పిల్లలకే కాక… సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు రెడీగా ఉన్న ప్రజలకూ ఒకేలా స్థానికత నిబంధన ఖరారు చేసేందుకు బాబు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫైనల్ చేసిన ప్రతిపాదనల ఫైల్ ను లీగల్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం కోసం పంపించింది. గతంలో ఉపాధి, విద్య, ఇతర అవసరాల కోసం హైదరాబాద్ లో సెటిల్ అయిన ఏపీ ప్రజలు.. ఇప్పుడు తిరిగి వెళ్లాలనుకుంటే ఇబ్బంది రాకుండా ఉండేందుకే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో.. ఏపీలో ఉపాధి, విద్య అవకాశాల కోసం వెళ్లేవారికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. ప్రస్తుతం అడ్వకేట్ జనరల్ పరిశీలనలో ఉన్న ఈ నిర్ణయంపై న్యాయ సలహా రాగానే..సీఎం బాబు దగ్గరికి ఫైల్ చేరనుంది. సీఎం ఓకే చేసిన వెంటనే.. కేంద్ర హోం శాఖకు.. అటు నుంచి 371 డి సవరణకు రాష్ట్రపతి దగ్గరుకు ప్రతిపాదన వెళ్లనుంది.

25(22)ప్రజల్లో గందరగోళం తొలగించి… మనరాష్ట్రం.. మన ఊరు అనే భావన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ఈ స్థానికత  అంశం పై ఒక టి రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి పూర్తి క్లారిటీ రానుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy