భారత్ – బంగ్లా మ్యాచ్ కు వర్షం అడ్డంకి..!

CRICKET-BAN-INDభారత్-బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న మీర్పూర్ వన్డే మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 43.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసేంది. అయితే వర్షం రాడంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.  మ్యాచ్ ప్రారంభం నుంచే తడబడుతూ బ్యాటింగ్ చేసింది ఇండియా. రెండో బాల్ కే రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. శిఖర దావన్(53), ధోనీ(47), రైనా(43) పరుగులతో రాణించగా… ముగ్గురు బ్యాట్స్ మెన్ డకౌట్ అయ్యారు.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy