మీసం మెలేసి టార్గెట్ రీచ్ : బ్రహ్మోస్ మిసైల్ సూపర్ సక్సెస్

missileసూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్  టెస్ట్ ను భారత్ ఈ రోజు(మార్చి22) ఉదయం 8 గంటల 42 నిమిషాలకు రాజస్థాన్‌లోని పోఖ్రాన్ క్షిపణి కేంద్రం నుంచి విజయవంతంగా పరీక్షించింది. బ్రహ్మోస్ టెస్ట్ విజయవంతమవడంతో ఢిఫెన్స్ రీసెర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(DRDO)ను ట్విట్టర్ ద్వారా రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామణ్ అభినందించారు. దేశ రక్షణ వ్యవస్ధలో ఇది ఓ అదనపు బూస్ట్ అని సీతారామణ్ తెలిపారు.

సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్ క్షిపణిని 2017 నవంబర్లో చివరిసారిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానం సుఖోయి -30 ఎంకేఐ నుంచి పరీక్షించారు. గత సంవత్సరం దుబాయ్ ఎయిర్ షోలో కూడా బ్రహ్మోస్ ప్రదర్శన జరిగింది. వివిధ దేశాలు కూడా బ్రహ్మోస్ క్షిపణులను కొనేందుకు చాలా ఆసక్తి చూయించాయి.

బ్రహ్మోస్ ప్రత్యేకతలు :

-బ్రహ్మోస్ అనే పదం భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది(Brahmaputra) మొదటి నాలుగు అక్షరాలు, రష్యాలోని మాస్కోవా నది(Moskva) పేరులోని మొదటి మూడు అక్షరాలన నుంచి వచ్చింది.
-భూమి, ఆకాశం, సముద్రం నుండి దీనిని ప్రయోగించవచ్చు.
-ఇంతకుముందు 2.8 నుంచి 3.0 మాక్‌ల వేగంతో బ్రహ్మోస్‌ ప్రయాణించేది. ప్రస్తుతం దీని వేగం 5.0 మాక్‌లకు అప్‌గ్రేడ్‌ చేశారు. (మాక్‌ = 1234.8 కిలోమీటర్‌/అవర్‌)
-ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన యాంటీ షిప్‌ క్రూయిజ్‌ క్షిపణి.
-2006 నుంచి ఇది సేవలందింస్తోంది

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy