మీ చిత్తశుద్ధికి సలాం మేడమ్ : గోండ్ భాష నేర్చుకుంటున్న కలెక్టర్

adilabad-collectorగిరిజనులకు అర్ధమయ్యే భాషలో పరిస్ధితులను చెప్పి, వారి స్థితిగతులను తెలుసుకుని సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య దేవరాజన్ కొన్ని వారాలుగా గొండు భాషను నేర్చుకుంటున్నారు. తన కమ్యూనికేషన్ స్కిల్స్.. తన బలమని దివ్య తెలిపారు. ఇప్పుడు వారితో వారి భాషలో మాట్లాడగలనని, వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే వారు తనను అర్ధం చేసుకోపోతే నా పాయింట్ ను వాళ్లకి ఎలా కమ్యూనికేట్ చేయగలనన్నారు దివ్య. ఈ గొండు భాషను నేర్చుకోవడం చాలా అవసరమని, గొండుల సాంప్రదాయాలు, సంస్కృతి తెలుసుకునేందుకు ఆశక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 30 శాతం భాషను నేర్చుకున్నారని.. త్వరలో భాషపై పట్టు సాధిస్తానని దివ్య తెలిపారు.

ప్రతి రోజు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తన క్యాంప్ ఆఫీసులో రోజుకి 30 నిమిషాలు గొండు భాషను నేర్చుకోవడానికి సమయం కేటాయిస్తున్నానని తెలిపారు దివ్య. ఈ భాషను నేర్యుకోవడానికి తనకు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ సీనియర్ అనౌన్సర్ దుర్వ భూమన్న సాయం చేస్తున్నారని తెలిపారు. వాళ్ల భాషను అర్ధం చేసుకోవడం ద్వారా చాలా మంది గిరిజనులు.. తమ సమస్యలు చెప్పుకునేందుకు ముందుకొస్తున్నారని, మరీ ముఖ్యంగా మహిళలు వారి సమస్యలు తనతో పంచుకునేందుకు ముందుకొస్తున్నారని తెలిపారు. నేను  తెలుగులో మాట్లాడితే వాళ్లు తిరిగి రిఫ్లయి ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారని.. గొండు భాషల్ కొన్ని పదాలు మాట్లాడుతుంటే వారు అర్ధం చేసుకుంటున్నారన్నారు. అప్పుడే వాళ్లు నిజమైన సమస్యలను అర్ధం చేసుకొంటారని ఆమె తెలిపారు.
రెండు నెలల నుంచి దివ్యకు గొండు భాషను నేర్పిస్తున్నానని, ఇప్పటికే ఆమె చాలా పదాలు నేర్చుకుందన్నారు. భాషను నేర్చుకునే సమయంలో ఆమె సహనాన్ని అభినందించాల్సిందే అన్నారు ఆమె ట్యూటర్.
మార్చి 14 న ఆదిలాబాద్ జిల్లా నర్నూర్ మండలం జమడా గ్రామంలో జరిగిన రాయ్ సెంటర్ మీటింగ్ లో లీడర్లతో కలసి పాల్గొన్న కలెక్టర్ దివ్య.. మూడు నిమిషాలు గొండు భాషలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొంతమంది గొండు మహిళలతో కలసి ఆమె భోజనం చేసింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy