ముంచుకొస్తున్న ముప్పు : ఆ మంచుకొండ బద్దలైంది

ice-burgప్రపంచంలోనే మంచుతో కప్పబడిన ఏకైక ఖండం అంటార్కిటికా. ఈ ఖండం మొత్తం మంచు పర్వతాలు, కొండలే ఉంటాయి. అందులోని అతి పెద్ద కొండ బద్దలైంది. వెస్ట్ అంటార్కిటికాలోని లారెన్స్-సి అనే ప్రాంతంలో 5వేల 800 చదరపు కిలోమీటర్లు ఉన్న ఈ మంచు కొండకు జూలై 10వ తేదీన చీలికలు గుర్తించారు శాస్త్రవేత్తలు. రెండు రోజుల వ్యవధిలోనే అంటే జూలై 12వ తేదీకి ఇది రెండుగా చీలిపోయింది. 5వేల 800 చదరపు కిలోమీటర్ల మేర ఈ కొండ రెండు ముక్కలు అయ్యింది. అంటే ఓ దేశానికి రెండంతల వెడల్పు ఇది.(లండన్ లోని లక్సెంబర్గ్ దేశంతో పోల్చితే).

ఈ ఘటన ప్రపంచదేశాలను షాక్ కు గురి చేసింది. ఇటీవలే ఈ ఖండంలో అక్కడక్కడ గడ్డి మొలుస్తుందని.. మంచు కరుగుతుందని వార్తలు వస్తే అమ్మో గ్లోబల్ వార్మింగ్ మొదలైంది.. ప్రపంచానికి ముప్పు వస్తుందని భయపడిపోయాం. ఇప్పుడు ఈ వార్త వింటే గుండెలు అదురుతున్నాయ్. ఈ భూమి పుట్టిన తర్వాత.. ఇంత పెద్ద ఎత్తున మంచు కొండ విరగటం ఇదే అంటున్నారు శాస్త్రవేత్తలు. ముంచుకొస్తున్న ముప్పుకు ఇది సంకేతం అంటున్నారు. వాతావరణంలో మార్పులకు పరాకాష్ఠ అని స్వాన్సీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy