ముండే, మహజన్ కుటుంబాలకు నెం.3 గండం..!

mundeyముండే, మహజన్ కుటుంబాలకు నెం.3 గండంగా మారింది. ఈ రెండు కుటుంబాల కీలక నేతలు 3వ తేదీనే ప్రమాదానికి గురై మృతి చెందడం విచారకరం. ఈ కుటుంబానికి చెందిన ముగ్గురు నేతలతో పాటు వీళ్ల సహచర నేత కూడా ఇదే తేదీన మృతి చెందడం చర్చనీయం. మూడు సంఖ్య తమ కుటుంబానికి గండంగా మారిందని దివంగత ప్రవీణ్ మహజన్ భార్య సారంగీ మహజన్ కన్నీరుమున్నీరయ్యారు. తాజాగా కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే గుండె పోటుతో మరణించడం, 3వ తేదీ నాడు ఆసుపత్రిలో మృతి చెందడంతో ఆమె ఈ విధంగా స్పందించారు. మహారాష్ట్ర నుండి 5 సార్లు గెలిచిన ముండే, ఈ సారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు తీసుకొని వారం కూడా గడవక ముందే ఆయన మృతి చెందడం కుటుంబ సభ్యులను, బీజేపీ కార్యకర్తలను తీవ్రంగా కలచి వేస్తోంది. మహారాష్ట్రలో బలమైన నేతగా ఎదిగిన ముండే అర్ధంతరంగా కనుమూయడం ఆ పార్టీ జీర్ణించుకోలేని అంశం.

pramod-mahajanబీజేపీలో కీలక నేతగా ఎదిగిన ప్రమోద్ మహజన్ మే-3-2006 నాడు మృతి చెందారు. అతని సోదరుడు ప్రవీణ్ మహజన్ చేత కాల్పులకు గురై హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆ తర్వాతి నెల జూన్-3న మహజన్ ముఖ్య అనుచరుడు వివేక్ మోయిత్రా మృతి చెందడం కలకలం రేపింది. ఈ ఘటనతో మహజన్ కుమారుడు రాహుల్ మతిస్థిమితం కోల్పోవడం ఆందోళన కరంగా మారింది. ఇక ప్రవీణ్ మహజన్ మృతి కూడా ఇదే 3వ తేదీన సంభవించింది. ఇక మార్చి-3, 2010లో మెదుడలో రక్తం గడ్డ కట్టిన సమస్యతో ప్రవీణ్ మహాజన్ కూడా మృతి చెందారు.

pravin_mahajanతాజాగా మళ్లీ అదే 3వ తేదీనాడే గోపీనాథ్ ముండే మృతి చెందడంతో ఆ కుటుంబంలో ఆందోళన మరింత ఉధృతమైంది. జూన్-3, 2014న గోపీనాథ్ ముండే ఢిల్లీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ముండే మృతి వల్ల తమ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయారని సారంగీ వాపోయారు. మంత్రి అయ్యాక ముండే తమ కుటుంబాలను ఆదుకుంటారని ఎన్నో ఆశలు పెంచుకున్నామని, కానీ ఆయన అర్ధంతరంగా మృతి చెందడం తమను కోలుకోలేకుండా చేస్తుందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy