ముంపు ప్రాంతాలు ముమ్మాటికే తెలంగాణకే..

DSPC2పోలవరం ముంపు ప్రాంతాలను ఎట్టి పరిస్ధితుల్లోనూ వదులుకోమన్నారు రాష్ట్ర సీఎం కేసీఆర్. పోలవరం ఆర్డినెన్స్ ను ఎన్డీఏ ఆమోదించడంపై ఆయన మండిపడ్డారు. ఏడు మండలాలను ఖచ్చితంగా కాపాడుకుంటామన్నారు. మంది బలంతో ఎన్డీఏ సర్కార్ బిల్లును ఆమోదించిందని ఆరోపించారు. న్యాయ, రాజ్యాంగ నిపుణులతో చర్చించి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ అన్నారు. ఆర్టికల్ 3 ని కేంద్రం పట్టించుకోకుండా తెలంగాణ, ఒడిశ, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల గిరిజనులను ముంచారని విమర్శించారు.

విప్ జారీ చేసి టీడీపీ, బీజేపీలు తెలంగాణ ప్రజల గొంతు కోశాయని విమర్శించారు. టీ.టీడీపీ, టీ.బీజేపీ నేతలైనా అడ్డుకోని ఉంటే బాగుండేదన్నారు. ముంపు ప్రాంతాలు ముమ్మాటికే తెలంగాణకే చెందుతాయన్నారు కేసీఆర్.

న్యాయపోరాటం చేస్తాం: టి.ఎంపీలు

పోలవరం ఆర్డినెన్స్ ను లోక్ సభలో ఆమోదించడంపై తెలంగాణ ఎంపీలు ఫైర్ అయ్యారు. చట్టవిరుద్ధంగా ఆర్డినెన్స్ ను లోక్ సభకు తీసుకువచ్చారని మండిపడ్డారు. న్యాయపోరాటం చేసి ముంపు ప్రాంతాలు తెలంగాణలోనే ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణలోని ఇంచు భూమి కూడా వదులుకోమన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలపడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా సీమాంధ్ర నేతల కుట్రలు సాగుతున్నాయన్నారు. అవసరమైతే ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.

ఇంత హాడావుడి నిర్ణయం ఎందుకు: డీఎస్

పోలవరం ఆర్డినెన్స్ గురించి ఎన్డీఏ ప్రభుత్వం ఇంత హాడావుడి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు డీఎస్. గిరిజనుల జీవితాలకు విలువలేదా అని ఆయన అన్నారు. రాష్ట్రాల సరిహద్దులు మార్చే టైంలో రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా ఎలా విభజిస్తారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే బిల్లును ఆమోదించారని ఆయన అన్నారు. ఖమ్మం ప్రజల అభిఇష్టాలకు వ్యతిరేకంగా ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన అన్నారు. మూడు రాష్ట్రాల నేతలు వ్యతిరేకిస్తూ కేంద్రం ఏకపక్షంగా ముందుకెళ్లిందన్నారు. అసలు చర్చే లేకుండా ఎలా ఆమోదిస్తారని నిప్పులు చెరిగారు డీఎస్.

TJACPC2రేపు తెలంగాణ బంద్: కోదండరాం

పోలవరం ఆర్డినెన్స్ లోక్ సభలో ఆమోదించడంపై టీజేఏసీ చైర్మన్ కోదండరాం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి విలువలేదని ఆయన అన్నారు. కేంద్రం ఇలా చేయడం ప్రజల హక్కుల మీద దాడి చేయడమేనని ఆయన అన్నారు. గిరిజనుల హక్కుల కోసం తాము పోరాటం చేస్తామని కోదండరాం చెప్పారు.  కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని…రేపటి బంద్ కు అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. లోక్ సభలో చర్చే జరక్కుండా ఎలా ఆమోదిస్తారని ఆయన ప్రశ్నించారు. ఎవర్నీ సంప్రదించకుండా ఎలా చేస్తారని..దీని గురించి కేంద్రం పునరాలోచించాలన్నారు కోదండరాం.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy