26 / 11 కు ఆరేళ్ళు!

mumbai26 / 11…

ఈ డేట్ వింటే చాలు ముంబై ప్రజలు భయంతో వణికిపోతారు. ముష్కరుల దాడిని తలుచుకొని భయంతో వణికిపోతున్నారు. బిక్కుబిక్కుమంటూ ప్రాణాలతో బయపడిన వారు ఆ క్షణంలో నరకం చూశామని చెబుతున్నారు. 26/11…ఇండియాపై టెర్రరిస్ట్ లు పంజా విసిరిన రోజు. ముంబైలో సాగిన దారుణ మారణహోమానికి ఈరోజుతో ఆరు సంవత్సరాలు.

  • ఆయుధాలతో సముద్రతీరం నుంచి ముంబైలోకి అడుగు పెట్టిన 10 మందితో కూడిన ముష్కరమూక దాదాపు మూడు రోజుల పాటు నగరాన్ని వణికించింది.
  • ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ రైల్వే స్టేషన్, తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్, ట్రైడెంట్ ఒబెరాయ్, నారిమాన్ హౌస్ లలోని దేశ విదేశీయులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
  • టెర్రరిస్టుల దాడిలో విదేశీయులతో సహా 166 మంది చనిపోయారు.
  • టెర్రరిస్టుల దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టారు ముంబై పోలీసులు, ఇండియన్ ఆర్మీ. భద్రతా దళాల దాడిలో తొమ్మిది మంది టెర్రరిస్ట్ లు చనిపోగా, అజ్మల్ కసబ్ సజీవంగా దొరికాడు.
  • కసబ్ ను నాలుగేళ్ల పాటు విచారించి 2012 నవంబర్ 21న ఉరితీశారు.
  • స్వతంత్ర భారతావని చరిత్రలో ముంబై దాడుల ఘటన నెత్తుటి మరకలు అంటించింది.
  • ఈ ఘటన తో యావత్ దేశం ఉలిక్కి పడింది. ముంబై దాడి తర్వాత దేశంలో భద్రతను పటిష్టం చేశారు.

26/11 ఘటన చిత్రాలు… 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy