ముంబైలో ధోని, కోహ్లీ రెస్టారెంట్

dhoniముంబైలో ధోనీ, కోహ్లీ రెస్టారెంట్ ప్రారంభమైంది. వారిద్దరూ కలిసి రెస్టారెంట్‌ వ్యాపారం ఎప్పుడు ప్రారంభించారని అనుకుంటున్నారా. ఆ రెస్టారెంట్ వాళ్లిందరూ ఏర్పాటు చేసింది కాదట. ధోనీ, కోహ్లీ మీద అభిమానంతో ముంబైకి చెందిన ఓ వ్యక్తి వాళ్లిద్దరి పేరుతో రెస్టారెంట్‌ పెట్టారు. కాండీవలి ఈస్ట్‌ ప్రాంతంలో ఈ రెస్టారెంట్‌ ఉంది. వారిద్దరికీ ఉన్న పాపులారిటీని ఈ రెస్టారెంట్‌ యజమానులు ఇలా క్యాష్‌ చేసుకుంటున్నారు.

క్రికెట్‌ అభిమానులను ఆకర్షించేందుకు ఇలా పేరు పెట్టారు నిర్వాహకులు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ధోనీ ఆదివారం( అక్టోబర్-22) నుంచి న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌ కోసం రెడీ అవుతున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య అక్టోబర్‌ 22న మొదటి వన్డే జరగనుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy