ముంబైలో హర్రర్ : వీధి కుక్కలన్నీ రంగు మారాయి

_fab3b0f2-7e55-11e7-ba32-a280bea68af6మనం రకరకాల కుక్కలను చూస్తూ ఉంటాం.. కానీ బ్లూకలర్స్ తో ఉండే డాగ్స్ ప్రస్తుతం ముంబైలోనే దర్శనమిస్తున్నాయి. వీటికి కావాలనే రంగులు వేశారనుకుంటే పొరపాటే. ఎందుకంటే వాటికి అవే బ్లూ కలర్ లో మారిపోతున్నాయి. కొన్ని రోజులుగా ముంబై వీధుల్లోని కుక్కలన్నీ ఇలా రంగు మారిపోతుండటం సంచలనం అయ్యింది. ప్రతి ఒక్కరిలో ఇదే చర్చ అవుతుంది. ఎందుకు రంగులు మారుతున్నాయో అర్థం కాక సామాన్యులు బెంబేలెత్తుతుంటే.. దీనిపై విచారణ చేపట్టింది ముంబై కార్పొరేషన్. అసలు విషయం తెలిసిన తర్వాత జనంలో మరింత కలకలం.

బ్లూ కలర్స్ తో ఉన్న కుక్కలను ముంబై యానిమల్ ప్రొటెక్షన్ సెల్ విచారణ చేపట్టింది. ముంబై మహా నగరం చుట్టూ ఉన్న ఫార్మా, కెమికల్, ఫుడ్ ప్రాసెస్ ఫ్యాక్టరీలు వెయ్యికి పైగా ఉన్నాయి. వీటి నుంచి వచ్చే వ్యర్ధాలు, రసాయన నీళ్లను కాలువలు, డ్రైనేజీ, నదుల్లోకి వదిలేస్తున్నారు. దీంతో ఆ నీళ్లు మొత్తం విషంగా మారాయి. వీధుల్లోని కుక్కలు ఆ నీటి తాగటం వల్ల శరీరం అంతా విషతుల్యమై.. రంగుమారిపోతున్నాయి. తర్వాత స్టేజ్ లో చనిపోతున్నాయంట.

ఇప్పటి వరకు కుక్కలే రంగు మారాయి.. ఇలాగే వదిలేస్తే రేపు మేం కూడా రంగు మారతామా అంటూ సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ముంబై కార్పొరేషన్, పొల్యూషన్ బోర్డ్ కు కంప్లయింట్స్ చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు విచారణ కోసం ప్రత్యేక అధికారిని నియమించారు. ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు, కలుషిత నీటిని ఇలా వదిలేయటం చట్ట విరుద్ధం అని ప్రకటించారు. పర్యావరణాన్ని నాశనం చేస్తే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు MPCB రీజినల్ ఆఫీసర్ అనిల్ మోహేకర్.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy