ముంబైలో PBL సీజన్ – 2

saina-nehwalజ్వాలా – అశ్విని అరుపులు, సైనా – సింధూ మెరుపులు. ఇంటర్నేషనల్ స్టార్స్ తళుకులు. కొత్త ఏడాదిలో కొత్తగా బ్యాడ్మింటన్ క్రీడోత్సవం మొదలవబోతోంది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్…  సెకండ్ సీజన్ కు ముంబై రెడీ అయింది. 15 రోజుల పాటు జరిగే ఈ లీగ్ లో లోకల్ ప్లేయర్స్ తో పాటు ఇంటర్నేషనల్ స్టార్స్ తమ ఆటతో అభిమానుల్ని కట్టిపడేయబోతున్నారు. ఇండియన్ స్పోర్ట్స్ క్యాలెండర్ ని గ్రాండ్ గా ప్రారంభించబోతోంది ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్. ఇవాళ్టి నుంచి ముంబైలో పీబీఎల్ మొదలవతోబోంది. 15 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో దేశీ స్టార్స్ తో పాటు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తమ సత్తా చూపించబోతున్నారు.

సాయంత్రం 4 గంటకు ముంబైలో జరిగే ఓపెనింగ్ సెర్మనీతో ఈ లీగ్ మొదలవుతుంది. అక్షయ్ కుమార్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఐబీఎల్.. ఫస్ట్ ఎడిషన్ సూపర్ సక్సెస్ అయింది. ఈసారి కూడా దాన్ని రిపీట్ చేసేందుకు రెడీ అయ్యారు నిర్వహకులు. ఓపెనింగ్ సెర్మనీలో జాక్వలైన్ ఫెర్నాండేజ్ డాన్స్ స్పెషల్ అట్రాక్షన్ కాబోతుంది. సలీమ్-సులేమాన్ మ్యూజిక్ తో హోరెత్తించబోతున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

లీగ్ లో ఫస్ట్ మ్యాచ్ … సైనా నెహ్వాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న అవధ్ వారియర్స్… ముంబై రాకెట్స్ తో జరుగుతుంది. ప్రో కబడ్డీలో లాగా.. ఒక్కో హోం టౌన్ లో మూడు రోజులు పాటు నాలుగు మ్యాచ్ లు జరుగుతాయి. హైదరాబాద్ లో 9 నుంచి 11 వరకు మ్యాచ్ లు ఉంటాయి. ఈ నెల 17న ఫైనల్స్ కు ఢిల్లీ వేదికవబోతోంది. టోర్నీలో మొత్తం ఆరు నగరాల్లో ఆరు టీంలు బరిలో దిగుతున్నాయి. తొలి సీజన్ 2013 ఆగస్టులో జరిగింది. ఫస్ట్ ఎడిషన్ లో హైదరాబాద్ హాట్ షాట్స్ విన్నర్ గా నిలిచింది. ఫ్రాంచైజ్ ల మధ్య గొడవల కారణంగా రెండేళ్ల పాటు పీబీఎల్ జరగలేదు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుని అన్నీ సెట్ రైట్ చేయడంతో సెకండ్ సీజన్ కు సర్వం సిద్ధమైంది. ఇక ఐబీఎల్ తమదేనని పాత నిర్వహకులు కోర్టుకెక్కడంతో.. ఈ సీజన్ ను పీబీఎల్ పేరుతో టోర్నీని నిర్వహిస్తున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy