ముంబై, కాకినాడలకు పెనుముప్పు

kakinada-coastతీరప్రాంతాలకు డేంజర్ సిగ్నల్స్ జారీ చేస్తోంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. కరిగిపోతున్న మంచు తీరప్రాంతాలకు ముప్పుగా పరిణమించనుందని తెలిపింది.  ముఖ్యంగా ముంబై, మంగళూరు, కాకినాడలకు పెను ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. సముద్ర తీరాలు కుచించుకుపోవడం వల్ల భూమ్యాకర్షణ, భ్రమణ శక్తులు ప్రభావితమవుతాయని, సముద్ర మట్టాల పెరుగుదలల్లో అసాధారణ పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంది. ఇదే ధోరణి కొనసాగితే వచ్చే 100 ఏళ్లలో మంగళూరు సముద్ర మట్టం 15.98 సెం.మీ., ముంబైలో అయితే 15.26 సెం.మీ.లు, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ తీరు 15.16 సెం.మీ.లకు చేరుకోనున్నాయి.

భూతాపంతో తీర ప్రాంతాల్లోని నగరాల పరిస్థితి ఏమిటన్న విషయంపై నాసా పరిశోధనలు ప్రారంభించింది. శాస్త్రవేత్తలు ‘గ్రేడియంట్‌ ఫింగర్‌ ప్రింట్‌ మ్యాపింగ్‌’ అనే పరికరాన్ని రూపొందించారు. మంచు పర్వతాలు ఏ మేరకు కరుగుతున్నాయి? తద్వారా ఏయే దేశాల్లో ఎంత మేరకు సముద్ర మట్టం పెరుగుతోంది? అనే విషయాలను గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా 293 తీర ప్రాంత నగరాలపై ఈ అధ్యయనం జరిపారు. ‘ రాబోయే 100 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని వరదల ప్రభావాన్ని తగ్గించే ప్రణాళికలు రూపొందించాలి’ అని నాసా శాస్త్రవేత్త ఎరిక్‌ ఇవిన్స్‌ అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy