ముంబై ముక్కుమూసుకుంది : ఓఖీతో కొట్టుకొచ్చిన 100 టన్నుల చెత్త

chettaముంబై మహానగరం. సముద్ర తీరం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఉదయం వాకింగ్, జాగింగ్ చేసేవారితో.. సాయంత్రం సరదాగా వచ్చే కుటుంబాలతో సందడిగా ఉంటుంది. ఇప్పుడు ముంబై వాసులు బీచ్ లకు వెళ్లాలంటే భయపడుతున్నారు. వెళ్లినా ముక్కు మూసుకుంటున్నారు. సముద్రం గాలుల నుంచి ఈ కంపు సిటీపై వస్తుండటంతో జనం దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీని అంతటికీ కారణం ఓఖీ తుఫాన్.

ఓఖీ తుఫాన్ ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు పడ్డాయి. సముద్రం ఉప్పొంగించి. పెద్ద పెద్ద అలలు భయపెట్టాయి. సముద్రం పోటు చూసి బెంబేలెత్తారు జనం. తుఫాన్ సమయంలోనే ముంబై తీరానికి పెద్ద ఎత్తున చెత్త కొట్టుకువచ్చింది. సముద్రం లోపలి నుంచి తీరానికి చేరింది చెత్తం. ఎంత అంటే అక్షరాల లక్ష కేజీలు.. 100 టన్నులు. అంతా ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్స్, ఫుడ్ ప్యాకెట్లు, దుస్తులు ఇలా సముద్రంలోని చెత్తాచెదారం మొత్తం తీరానికి కొట్టుకొచ్చింది. ముంబైలోని జూహూ, మెరీనా, వెర్సోవా బీచ్ లు ఇప్పుడు చెత్త కుప్పలుగా మారాయి. ఒక్క వెర్సోవా బీచ్ లోనే 15వేల కిలోల చెత్త పేరుకుపోయింది. ఇక జుహూ బీచ్ లో 10వేల కిలోలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముంబై తీరం మొత్తం ఇప్పుడు చెత్తతో నిండిపోయింది.

తీర ప్రాంతంలోని జనం అయితే ఈ చెత్త కంపుతో వణికిపోతున్నారు. ముక్కులు మూసుకుని వెళుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ముంబై సిటీలోని చెత్తనంతా తీసుకెళ్లి సముద్రంలో వేశారు. ఇప్పుడు ఓఖీ తుఫాన్ దెబ్బకి.. ఆ చెత్త అంతా మళ్లీ ముంబై సిటీ తీరానికే కొట్టుకొచ్చింది. మొత్తం ప్లాస్లిక్ మయం. ఇదంతా మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు మాత్రమే కొట్టుకు వచ్చిన చెత్త ఇది. ఇప్పటి వరకు 20 ట్రక్కుల ద్వారా చెత్తను తొలగిస్తున్నా.. ఏ మాత్రం తగ్గలేదు. మొత్తం 100 టన్నుల చెత్త తొలగించాలంటే మరో వారం రోజులు పడుతుందని.. అప్పటి వరకు బాధలు తప్పవు అంటున్నారు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. సముద్రం ఏమీ ఉంచుకోదు.. అన్నింటినీ బయటకు వేస్తుంది అంటారు.. ఇది నిజమే అని ముంబై తీరం మరో సారి చెప్పింది..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy