ముంబై వన్డే : భారత్ పై న్యూజిలాండ్ విజయం

cricketఆదివారం(అక్టోబర్-22) ముంబైలో భారత్ తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది.281 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసి విజయం సాధించింది. న్యూజిలాండ్ ఆటగాళ్లు రాస్ టేలర్ (95 ), టామ్ లాథమ్ (103 నాటౌట్ ..సెంచరీ) రాణించడంతో ఆ జట్టు విజయం తేలికైంది. భారత్ కెప్టెన్ 200వ వన్డే ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ (125 బంతుల్లో 121: 9 ఫోర్లు, 2 సిక్సర్లు)తో రాణించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్, బుమ్రా, పాండ్యా, కుల్దీప్ తలో వికెట్ తీశారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. టిమ్ సౌథీ రెండు వికెట్లు.. సాంట్నర్ ఓ వికెట్ తీసుకున్నాడు. రాస్ టేలర్, టామ్ లాథమ్ 200 పాట్నర్ షిప్ కావడం విశేషం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy