ముకేష్ అంబానీతో సంబంధాలపై మోడీ స్పందించాలి: కేజ్రీవాల్

images (1)
గ్యాస్ ధరల పెంపు విషయంలో కేంద్రం అంబానీకి అండగా ఉంటుందని ఆరోపించారు. ఇదే విషయంలో తన అభిప్రాయం చెప్పాలని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. దీనిపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ రిలయన్స్ కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు కేజ్రీవాల్.

దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ సభలకు వినియోగిస్తున్న ఫండ్స్ గురించి మోడీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు కేజ్రీవాల్. రాహుల్ గాంధీ, మోడీ హెలికాఫ్టర్లు వినియోగిస్తున్నారు అవి సొంతవా కాదా అని ప్రశ్నించారు కేజ్రీవాల్.. సొంతవి కాకపోతే వాటికి డబ్బులు ఎవరు చెల్లిస్తున్నారని ఆరోపించారు. మోడీ ఎలక్షన్ ప్రచారానికి ముకేష్ అంబానీ వెనక సపోర్ట్ గా నిలుస్తున్నారని లేటర్ లో రాశారు కేజ్రీవాల్. ఇలాంటి లెటర్ ను రాహుల్ గాంధీకి కూడా రాస్తానని ఆయన అన్నారు.

అంబానీపైనా, స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనంపైనా మోడీ స్పందించాలని డిమాండ్ చేశారు కేజ్రీవాల్. ఒక వేళ మోడీ సీఎం అయితే అంబానీకి వ్యతిరేకంగా వ్వవహరిస్తారా అని ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వాన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మనే నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే కాంగ్రెస్, బీజేపీలు అంబానీపై కేసును ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో చెప్పాలన్నారు. ఇలాంటివి 10 కోట్ల లెటర్లను దేశ వ్యాప్తంగా పంచుతామన్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy