ముఖమండపం ఇదే.. శరవేగంగా యాదాద్రి ఆలయ పనులు

YGTతెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదాద్రి అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ముఖమండపం స్లాబు పనులు ప్రారంభమయ్యాయి. గర్భాలయ మట్టానికి 36 అడుగుల ఎత్తులో 20 వేల చదరపు అడుగులతో మూడురోజుల పాటు ఈ పనులను చేయనున్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి నియమించిన ఇంజినీరింగ్ నిపుణుల కమిటీ సూచన మేరకు ఈ స్లాబును మూడురోజుల్లో వేయాలని నిర్ణయించారు. ప్రధానాలయాన్ని దసరానాటికి పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నామని ఈవో గీత ఈ సందర్భంగా తెలిపారు. ముఖమండపానికి మొదటగా ఆళ్వారు స్తంభాలను అమర్చారు. మొదటి అంతస్తులో కాకతీయ స్తంభాలను అమర్చే ప్రక్రియతో పాటు.. స్లాబువేసే పనులను నిర్వహిస్తున్నారు. గర్భాలయంలో శ్రీలక్ష్మీనరసింహుడు కొలువుదీరిన చోటు నుంచి దివ్య విమాన గోపురం వరకు పనులు శరవేగంగా సాగుతున్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy