ముగిసిన అనంత్ కుమార్ అంత్యక్రియలు… కేంద్రం పెద్దల నివాళులు

బెంగళూరు : దివంగత కేంద్ర పార్లమెంటరీ శాఖ మంత్రి అనంత్ కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించింది. చమరాజ్ పేట్ స్మశాన వాటికలో మిలటరీ గౌరవ లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. భద్రతా బలగాలు గార్డ్ ఆఫ్ ఆనర్ తో కడసారి నివాళులు అర్పించాయి. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాల ప్రకారం.. 21 సార్లు గన్ ను పేల్చారు భద్రతాసిబ్బంది.

59 ఏళ్ల వయసున్న అనంత్ కుమార్.. లంగ్ క్యాన్సర్ తో కొన్ని నెలలుగా బాధపడుతూ అకస్మాత్తుగా చనిపోయారు. సోమవారం బెంగళూరు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనంత్ కుమార్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉపప్రధాని ఎల్కేఅద్వానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్, కర్ణాటక మంత్రులు, పార్టీల నాయకులు.. కీలక నేతలంతా అనంత్ కుమార్ కు నివాళులు అర్పించారు. ఆ తర్వాత మిలటరీ బలగాలు ఆయన పార్థివదేహాన్ని బీజేపీ హెడ్ క్వార్టర్స్ అయిన జగన్నాథ భవనానికి తీసుకెళ్లారు. అక్కడి ప్రజలు కడసారి నివాళులు అర్పించారు. ఆ తర్వాత స్మశాన వాటికకు తరలించారు.

అనంత్ కుమార్ కేంద్రంలో ఎరువులు, రసాయనాల శాఖ మంత్రిగానూ పనిచేస్తున్నారు. ఆరుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy