ముగిసిన ఆక్టోపస్‌ సెర్చ్‌ ఆపరేషన్‌  

happy homeముత్తూట్‌ దొంగలను ఎట్టకేలకు పట్టుకున్నారు ఆక్టోపస్‌ బలగాలు..నేటి తెల్లవారుజాము 3:30 వరకూ కొనసాగింది ఆపరేషన్‌. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు అధికారులు. ముత్తూట్‌ కార్యాలయంలోకి తుపాకులు, తల్వార్లతో వచ్చిన దొంగలు.. బంగారం తాకట్టు పెడతామంటూ మాటా ముచ్చటతో ఒక్కసారిగా కౌంటర్‌పై నుంచి దూకి దోపిడీకి యత్నించారు. ఉద్యోగులు, ఖాతాదారులు భయంతో కేకలు వేశారు. స్థానికులు అప్రమత్తమవ్వడంతో దొంగలు పరారయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు .

నిన్న(మంగళవారం) ఉదయం గం. 10:00 – మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో దోపిడీకి దుండగుల విఫలయత్నం
ఉదయం గం. 10:29 – ఉప్పర్‌పల్లిలోని హ్యాపీహోమ్స్‌ అపార్ట్‌మెంట్‌లో టవేరా వాహనాన్ని నిలిపిన దుండగులు
సాయంత్రం గం. 6:30 – హ్యాపీహోమ్స్‌ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో టవేరా వాహనాన్ని గుర్తించిన పోలీసులు
రాత్రి గం. 7:30 – వందలాది మంది పోలీసుల మోహరింపు
రాత్రి గం. 9:30 – ఆక్టోపస్‌ బలగాల రాక. విద్యుత్‌ సరఫరా నిలిపివేత
రాత్రి గం. 10:00 – సైబరాబాద్‌ పోలీసులు, ఆక్టోపస్‌ సిబ్బంది కార్టన్‌ సెర్చ్‌ ప్రారంభం
తెల్లవారుజాము(బుధవారం) 3:30 –  ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

నగరంలో హైటెన్షన్‌.. ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్యాలయంలో దోపిడీకి ప్రయత్నించిన దుండగులు.. వారిని పట్టుకొనేందుకు భారీ స్థాయిలో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు వందలాది మంది పోలీసులు.. ఆక్టోపస్, గ్రేహౌండ్స్‌ బలగాలు. దాదాపు 500 ఫ్లాట్లలో అణువణువూ గాలించారు. సుమారు 10 గంటలపాటు ఆపరేషన్‌ నిర్వహించిన పోలీసులు ఎట్టకేలకు బుధవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆపరేష్‌ పూర్తయిందని, ఇక పట్టుబడ్డవారిని విచారించాల్సిఉందని ప్రకటించారు అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy